ఫిన్లాండ్ ఈ దేశం పేరు చెప్పగానే మనకు గుర్తు వచ్చేది ఒకటే. ఈ దేశంలో జనం ఎంతో సంతోషంగా ఉంటారు. అంతేకాదు ప్రపంచంలో ఎంతో సంతోషకరమైన దేశాల్లో ఫిన్లాండ్ ఒకటి. ఇక్కడ ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి. ప్రజలకు ఎలాంటి కష్టాలు ఉండవు ప్రభుత్వ రూల్స్ కూడా బాగుంటాయి . అందుకే ఇక్కడ జనాభా కూడా ఎంతో సంతోషంగా ఉంటారు. మంచి సౌకర్యాలు ఉండటంతో ఈ దేశం నుంచి యువత వేరే దేశానికి కూడా వెళ్లరు.
ఇంత సంతోషం ఉన్నా ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశం ఫిన్లాండ్ ప్రస్తుతం ఒక విషయం గురించి ఆందోళన చెందుతోంది. అదే ఆదేశ వృద్ధ జనాభా. ఇక్కడ ముసలి వారు పెరుగుతున్నారు యువత తగ్గుతున్నారు. ఇక కార్మికులు లేక చాలా సంస్దలకు ఇబ్బంది ఉంది. అంతేకాదు ప్రభుత్వ ఉద్యోగాలు చాలా ఖాళీలు ఉన్నాయి. అందుకే ఇతర దేశాల ప్రజలు ఇక్కడకు వచ్చి స్థిరపడాలని ఫిన్లాండ్ కోరుకుంటోంది.
మాకు యువ ప్రజలు కావాలి అని టాలెంట్ ఉన్న వారిని ఆహ్వనిస్తోంది. ఇక్కడ పని చాలా సులువుగా దొరకుతుంది. కాని కొన్ని నిబంధనలు ఉన్నాయి .ఇక్కడకు ఉద్యోగం కోసం వచ్చేవారు ఒంటరిగా రావాల్సి ఉంటుంది. జంటగా వచ్చేవారికి ఇక్కడ ఉద్యోగాలు దొరకవు. అందుకే చాలా మంది కుటుంబాలు వచ్చి ఉద్యోగాలు చేయడం లేదు. వృద్ధుల జనాభాలో ఫిన్లాండ్ జపాన్ తరువాత రెండవ స్థానంలో ఉంది. వందలో 40 శాతం మంది 60 ఏళ్లు దాటిన వారు ఉన్నారు.