సంచలనం : గ్రూప్1 నియమాకాల్లో ఇంటర్వ్యూలు రద్దు

0
125

ఆంధప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామక విధానంలో మార్పులు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది ఆంధ్ర ప్రభుత్వం. గ్రూప్ 1 లో ఇంటర్వ్యూల విధానాన్ని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. అన్ని కేటగిరీల్లో ఇంటర్వ్యూల విధానం ఇకపై ఉండదని ప్రకటించింది.

ఉద్యోగ నియామకాల్లో పూర్తిస్థాయి పారదర్శకత కోసమే ఇంటర్వ్యూల రద్దు నిర్ణయం తీసుకున్నట్ల ప్రభుత్వం వెల్లడించింది. ఇంటర్వ్యూల విధానంలో లోపాలు ఉన్నట్లు గుర్తించిన ప్రభుత్వం ఈ మేరకు సంస్కరణలు చేపట్టింది.

ఇకపై ఎంట్రన్స్ పరీక్షలో ఏ అభ్యర్థికి ఎక్కువ మార్కులు వస్తే వారే విజేతగా నిలిచి ఉద్యోగం పొందుతారు. ఇంటర్వ్యూలు మనుగడలో ఉన్నప్పుడు ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చినా… ఇంటర్వ్యూల సమయంలో తక్కువ వచ్చిన వారికి ఎక్కువ మార్కులు వేసి వారిని అర్హులుగా తేల్చిన దాఖలాలు ఉన్నాయి. ఇంటర్వ్యూ విధానంలో పారదర్శకత అనేది అంతగా లేదని భావించిన సర్కారు ఈ మేరకు కొత్త విధానం ప్రవేశపెట్టింది.