చిరంజీవి సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ – టాలీవుడ్ టాక్

Bollywood heroine in Chiranjeevi new movie

0
110
Ram charan upasana

టాలీవుడ్ లో ఇప్పుడు బాలీవుడ్ భామల సందడి కనిపిస్తోంది. చాలా సినిమాల్లో ఇప్పుడు బీ టౌన్ నుంచి తారలను తీసుకువస్తున్నారు. ఇక ముంబై భామలకు ఇప్పుడు కోలీవుడ్ టాలీవుడ్ లో అవకాశాలు ఎక్కువ వస్తున్నాయి. పాన్ ఇండియా సినిమాలు కావడంతో హిందీ నటీనటుల ఎంపిక ఎక్కువ జరుగుతోంది. అయితే తాజాగా టాలీవుడ్ వార్తల ప్రకారం చిరంజీవి సరసన బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా మెరవనుందనే టాక్ ఇప్పుడు జోరుగా వినిపిస్తోంది.

అయితే ఇంతకీ ఆ భామ ఏ సినిమాలో నటిస్తుంది అని అభిమానులు ఆలోచనలో ఉన్నారు. చిరంజీవి దర్శకుడు బాబీతో ఓ సినిమా చేయనున్నారు.ఈ సినిమాలో చిరంజీవి సరసన నాయికగా సోనాక్షి అయితే బాగుంటుందని భావించిన బాబీ, ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమాకి సంబంధించి వర్క్ లు జరుగుతున్నాయి.

Sonakshi Sinha

ఆమె హీరోయిన్ అవ్వచ్చు అనే టాక్ టాలీవుడ్ లో వినిపిస్తోంది. ఇక ప్రస్తుతం చిరు ఆచార్య సినిమా చేస్తున్నారు. తర్వాత మలయాళ మూవీ లూసిఫర్ రీమేక్ పట్టాలెక్కుతుంది.
ఆ తర్వాత వేదాళంరీమేక్ సెట్స్ పైకి వెళుతుంది. ఆ తరువాత బాబీ సినిమా సెట్స్ పైకి రానుంది.