Flash News : కత్తి మహేష్ పరిస్థితి విషమం, కొద్దిసేపట్లో హెల్త్ బులిటెన్ రిలీజ్

0
43

ప్రముఖ సినీ నటుడు, విమర్శకుడు కత్తి మహేష్ ఆరోగ్య పరిస్థితి ఆందోనళకరంగా మారింది. చెన్నై కలకత్తా రహదారిపై శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో కత్తి మహేష్ గాయపడ్డారు. తలకు బలమైన గాయాలయ్యాయి.

ప్రస్తుతం నెల్లూరులోని మెడికవర్ కార్పొరేట్ ఆసుపత్రిలో మహేష్ కు చికిత్స్ అందిస్తున్నారు. మహేష్ ప్రయాణించిన కారు దుగ్గు దుగ్గు అయింది. మహేష్ వాహనం లారీని వెనుకనుంచి ఢీకొ్ట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ప్రస్తుతం స్పెషల్ ఐసోలేసన్ లో వెంటిలేటర్ మీద ఉంచి మహేష్ కు చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. మహేష్ పరిస్థితి సీరియస్ గా ఉందని డాక్టర్లు తెలిపారు.

ప్రమాద సమయంలో మహేత్ తో పాటు డ్రైవర్ కూడా ఉన్నట్లు సమాచారం. డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో ప్రమాదంలో గాయపడిన వ్యక్తి కత్తి మహేష్ గా హైవే పెట్రోలింగ్ పోలీసులు గుర్తించారు.

కొద్దిసేపటి క్రితం మెడికవర్ హాస్పటల్ కు కత్తి మహేష్ స్నేహితులు, బంధువులు చేరుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితపై ఆరా తీస్తున్నారు ఆయన అనుచరులు అభిమానులు.

మరికొన్ని గంటల తర్వాత మహేష్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల చేస్తామని మెడికవర్ హాస్పటల్ యాజమాన్యం వెల్లడించింది.