మెగాస్టార్ తో అనసూయ.. ఎలాంటి రోల్ తెలుసా..!!

మెగాస్టార్ తో అనసూయ.. ఎలాంటి రోల్ తెలుసా..!!

0
107

ఒక వైపున బుల్లితెరపై .. మరో వైపున వెండితెరపై అనసూయ ఒక రేంజ్ లో సందడి చేసేస్తోంది. ప్రస్తుతం ‘కథనం’ చిత్రంలో ఆమె ప్రధాన పాత్రధారిగా చేస్తోంది. ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంటూ ఉండగానే ఆమె మరో భారీ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టుగా సమాచారం.

చిరంజీవి కథానాయకుడిగా కొరటాల దర్శకత్వంలో ఒక సినిమా రూపొందనుంది. చిరంజీవి పుట్టినరోజైన ఆగస్టు 22వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు. చిరూ సరసన కథానాయికగా శ్రుతి హాసన్ ను అనుకుంటున్నారు. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర వుందట. ఈ పాత్రను అనసూయతో చేయిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో కొరటాల ఆమెను సంప్రదించడం .. ఆమె ఓకే చెప్పడం జరిగిపోయాయని అంటున్నారు. ఇందుకోసం అనసూయకి భారీ మొత్తంలోనే పారితోషికం ముడుతోందని చెప్పుకుంటున్నారు.