ఏపీకి కొత్త గవర్నర్ గా సుష్మ స్వరాజ్..!!

ఏపీకి కొత్త గవర్నర్ గా సుష్మ స్వరాజ్..!!

0
63

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌గా నరసింహన్ కొనసాగుతున్నారు. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన సందర్భంగా అక్కడ కొత్త గవర్నర్‌ను నియమించే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. ఆ పదవికి సుష్మస్వరాజ్ అయితే చక్కగా సెట్ అవుతారని బీజేపీ హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం.

ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం పట్ల బీజేపీ పాజిటివ్‌గా ఉన్నప్పటికీ మున్ముందు నిధుల కేటాయింపులు, ప్రాజెక్టుల విషయంలో ఏపీ ప్రభుత్వం మొండి పట్టుదలకు వెళ్లే అవకాశం ఉందనీ, అలాంటి సమయంలో ఆ ప్రభుత్వాన్ని కంట్రోల్‌లో పెట్టేందుకు ప్రత్యేకంగా గవర్నర్ ఉండాలనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లే జరిగితే త్వరలోనే సుష్మస్వరాజ్ ఏపీలో గవర్నర్‌గా అడుగుపెట్టే అవకాశాలున్నాయి.