మగధీర సీక్వెల్ కు జక్కన్న ప్లాన్ – టాలీవుడ్ టాక్

Rajamouli plan for Magadheera Movie sequel -Tollywood talk

0
96

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన సినిమా మగధీర. ఈ సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో తెలిసిందే . 2009 లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ ని షేక్ చేసింది. ఈ సినిమాతో రామ్ చరణ్ స్టార్ ఇమేజ్ మరింత పెరిగింది. అయితే ఈ సినిమా సీక్వెల్ గురించి ఎప్పుడూ ఎవరూ చర్చించుకోలేదు. కానీ ఇటీవల ఈ సినిమాకి సీక్వెల్ ఉండవచ్చనే టాక్ నడుస్తోంది.

పన్నెండు సంవత్సరాల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సీక్వెల్ కు రామ్ చరణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్లో బిజీగా ఉన్న రామ్ చరణ్ ఈ సినిమా అయ్యాక దర్శకుడు శంకర్ తో సినిమా చేయనున్నారు. రాజమౌళి ప్రిన్స్ మహేష్ బాబుతో సినిమా చేస్తారు. ఈ రెండు ప్రాజెక్టులు అయ్యాక ఈ సీక్వెల్ ఉండే ఛాన్స్ ఉంది.

ఆర్ ఆర్ ఆర్ అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సి ఉంది. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది. మరి అనుకున్న సమయానికి చిత్రం విడుదల అవుతుందా లేదా అనేది చూడాలి. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం ఆచార్య సినిమాలో కూడా నటిస్తున్నారు.