వర్షాకాలంలో ఈ ఫుడ్ కు దూరంగా ఉండండి – నిపుణుల సలహా

Stay away from this food during the rainy season - expert advice

0
86

సీజన్ మారిన వెంటనే ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే ఏ సీజన్ లో తినే ఫుడ్ ఆ సీజన్లో కచ్చితంగా తీసుకోవాలి. వర్షాకాలం వచ్చింది అంటే కచ్చితంగా అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. వైరల్ ఫీవర్ కూడా ఈ సమయంలో ఎక్కువగా వేధిస్తాయి. మరి ఈ సీజన్లో తినకూడని ఆహార పదార్థాలేంటో తెలుసుకుందాం.

1. అసలు ఈ సమయంలో స్ట్రీట్ ఫుడ్ తీసుకోవద్దు, బజ్జీలు, పకోడీలు, సమోసాలు వీటికి దూరంగా ఉండాలి.

2. ఈగలు, దోమల కారణంగా ఇంకా అపరిశుభ్రంగా మారతాయి రోడ్ల వైపు అమ్మే ఫుడ్స్.

3.వర్షాకాలంలో బ్యాక్టీరియా – ఫంగల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. గొంగళి పురుగులు ఈ సీజన్లో ఆకు కూరలలో త్వరగా కనిపిస్తాయి. ఒకవేళ ఆకుకూరలు తీసుకుంటే కచ్చితంగా రెండు మూడుసార్లు కడిగి వేడినీటితో శుభ్రం చేసి వాడుకోవాలి.

4. పుట్టగొడుగులు, బ్రోకలీ, కాలీఫ్లవర్ వంటి వాటిని తినడం ఈ సీజన్లో అంత మంచిది కాదు.

5. రెయినీ సీజన్లో సలాడ్ లను తినడం తగ్గించుకోవాలి.

6. వర్షాకాలం సమయంలో చేపలు సముద్ర ఆహారాన్ని తినకూడదు. ఈ వర్షాల సమయంలో సముద్ర జీవులకు సంతానోత్పత్తి కాలం. అలాగే చాలా వరకూ మురికి నీరు కలుస్తుంది అందుకే సీ ఫుడ్ కు దూరంగా ఉండాలి.