ఈమధ్య సైబర్ కేటుగాళ్లు గురి చేసి పోలీసోళ్ల మీద పడ్డారు. ఉత్తుత్త వాళ్ల అకౌంట్స్ హ్యాక్ చేసి డబ్బులు అడిగితే జనాలు ఇస్తలేరనుకుని ఇలా తెగబడ్డారు.
తాజాగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి రూరల్ సిఐ కరుణాకర్ కు సంబంధించిన ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయింది. డబ్బులు ఇవ్వాలంటూ తన ఫ్రెండ్ లిస్టు లో ఉన్న వారికి కేటుగాళ్లు మెసెంజర్ లో మెసేజులు పంపారు. ఒక నెంబరు ఇచ్చి దానికి గూగుల్ పే చేయాలని అడుగుతున్నారు.
డబ్బులు ఇవ్వొద్దు : సిఐ
తన అకౌంట్ హ్యాక్ అయిందని ఖమ్మం జిల్లా సత్తుపల్లి రూరల్ సిఐ కరుణాకర్ తెలిపారు. దయచేసి ఎవరూ డబ్బులు ఇవ్వొద్దని ఆయన రిక్వెస్ట్ చేశారు. ఈ విషయమై సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్ కు సిఐ ఫిర్యాదు చేశారు. గూగుల్ పే నెంబరును సైబర్ క్రైం డిపార్ట్ మెంట్ కు బదిలీ చేశారు.
మొత్తానికి పోలీసుల పేరు చెప్పి డబ్బులు కొట్టేయడం ఈజీ అనుకుని ఇలా ఎగబడ్డారేమో అనిపిస్తున్నది. ఎందుకైనా మంచిది తెలుగు భాషలో కాకుండా ఎవరైనా దగ్గరి స్నేహితులు డబ్బులు అడిగితే మాత్రం క్రాస్ చెక్ చేసుకోకుండా అస్సల్ ఇయ్యకురి. అంతేకాదు… పోలీసోళ్లు డబ్బులు అడిగితే ఆదరాబాదరాగా వాళ్ల అకౌంట్ లో జమ చేసే పని అసలే పెట్టుకోవద్దని పోలీసు బాస్ లు కోరుతున్నారు.