లడ్డుగా ఉండేవారికి కరోనా డేంజర్ ఉందా? లేదా? : లేటెస్ట్ రిపోర్ట్

0
139

లడ్డుగా ఉండే వారికి చాలా కష్టాలే ఉంటాయి. వారు కుసుంటే లేవలేరు. లేస్తే కుసోలేరు. నడవాలంటే కూడా ఇబ్బందే. ఎప్పుడు ఏదో ఒక ఆరోగ్య సమస్య వారిని వెంటాడుతుంటది. అయితే లడ్డుగా ఉండేవారు అందరికీ అలా సమస్యలు ఏమీ ఉండవు. కొందరు లావుగా ఉన్నా ఆరోగ్యంగా ఉండేవారు కూడా ఉంటారు. లావుగా ఉండేవారికి కరోనా డేంజర్ బెల్సే… అని ఇటీవలకాలంలో బాగా ప్రచారంలో ఉంది. లావుగా ఉన్నవారికి కరోనా సోకితే ప్రమాదమే అనే వార్తలొచ్చాయి. ఊబకాయం ఉందా… మీకు పెద్ద ఉందా? అయితే మిమ్మల్ని కరోనా ఒక చూపు చూస్తది అని బెదిరించారు. తాజాగా ఒక అధ్యయనంలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. అవేంటో చదవండి.

లావు ఎక్కువగా ఉన్న మనుషులకు కోవిడ్ 19 సోకితే మరణానికి దారి తీస్తుందని జరుగుతున్న విశ్లేషణల్లో నిజం లేదని తాజాగా ఒక అధ్యయనం స్పష్టం చేసింది. సౌతాఫ్రికాలోని కేప్ టౌన్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం చేసి వివరాలు వెల్లడించారు. 44,305 మందితో సాగిన 58 అధ్యయనాలను అనాలసిస్ చేసి వివరాలు వెల్లడించారు.

ఐసిలో చేరిన కోవిడ్ రోగుల్లో పొగ తాగేవాళ్లకు 40శాతం, హై బిపి ఉన్న వారికి 54శాతం, షుగర్ రోగం ఉన్న వారికి 41 శాతం, శ్వాస సంబంధమైన రోగాలు ఉన్నవారికి 75శాతం వరకు మరణం సంభవించే ముప్పు ఎక్కువ అని తేలింది.

అలాగే ఈ ప్రమాదం గుండె సంబంధ రోగులకు, క్యాన్సర్ బాధితులకు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తెలిపింది. కిడ్నీ పేషెంట్స్ కు 2.4 రెట్లు ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది. ఈ వ్యాధులకు కోవిడ్ మరణాలతో ఉన్న రిలేషన్ ను ఈ పరిశోధన ధృవీకరించింది.

పురుషులకు, లడ్డుగా ఉన్న వారికి మరణం ముప్పు ఎక్కువ అనేదానికి ఎలాంటి ఆధారాలు లభించలేదని రీసెర్చ్ టీమ్ కు నాయకత్వం వహించిన బ్రూస్ ఎం బికార్డ్ వివరించారు. పొగ తాగడం, శ్వాస సంబంధ సమస్యల వల్ల ఏసీఈ2 రెసెప్టార్ల వ్యక్తీకరణ పెరుగుతుందని అన్నారు. మానవ శరీర కణంలోకి ప్రవేశించేందుకు ఈ రెసెప్టార్ ను కరోనా వైరస్ ఉపయోగించుకుంటుందన్నారు