టూత్ బ్రష్ చరిత్ర – అస్సలు ఎలా మొదలైందో తెలుసా

Toothbrush History

0
98

మనం ఉదయం లేవగానే కచ్చితంగా ఫేస్ వాష్ చేసుకుంటాం. పళ్లు తోముకున్నాకే మరేపని అయినా చేస్తాం. ప్రపంచంలో అందరూ టూత్ బ్రష్ వాడుతున్నాం. మరి ఈ పళ్లు తోముకునే బ్రష్ లు అసలు ముందు ఎలా తయారు చేశారు. ఏ దేశం దీనిని స్టార్ట్ చేసింది. ఇలాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ముందు చైనా వారు ఇలా టూత్ బ్రష్ ని పరిచయం చేశారు. జూన్ 26, 1498 న చైనా పాలకుడు హాంగ్జి మొదటిసారి టూత్ బ్రష్ వాడారట. అప్పట్లో జనం బూడిద, మట్టి, తైలం ఇలాంటి వాటితో పళ్ళు శుభ్రం చేసుకునేవారు. ఇక ఇలాంటి బ్రష్ పంది వెంట్రుకలతో తయారు చేశారట. ముళ్ళతో ఉన్న ఈ టూత్ బ్రష్తో పళ్లు తోమడం కష్టమైన పనే.పందుల మెడ వెనుక నుంచి తీసిన ముతక వెంట్రుకల నుంచి ఇవి తయారు చేశారు.

1938 వరకు పంది బొచ్చు టూత్ బ్రష్లు ఉపయోగించారు. డుపోంట్ డి నెమోర్స్ నైలాన్ బ్రిస్ట్ టూత్ బ్రష్ కనిపెట్టాడు. అది 1950 సంవత్సరం. అప్పటి నుంచి ఇలా అనేక రకాల బ్రష్ లు మార్కెట్లోకి వచ్చాయి.