తెలంగాణలో తగ్గు ముఖం పట్టిన కరోనా – బులిటెన్ రీలిజ్- జిల్లాల వారీగా కేసుల వివరాలు

Telangana corona Cases Bulletin released

0
33

తెలంగాణలో సోమవారం కరోనా మహమ్మారి తీవ్రత తగ్గింది. ఇవాళ బులిటెన్ లో కేసుల సంఖ్య 808 మాత్రమే నమోదు కావడం ఊపిరిపీల్చుకునే అంశం. 

జిల్లాల వారీగా కేసుల వివరాలు ఒకసారి చూద్దాం.

నేడు జారీ అయిన బులిటెన్ లో జిల్లాల వారీగా కేసుల వివరాల జాబితా కింద ఉంది చూడొచ్చు.

ఆదిలాబాద్  2

కొత్తగూడెం  31

జిహెచ్ఎంసి  82

జగిత్యాల  23

జనగామ  8

జయశంకర్ భూపాలపల్లి   16

జోగులాంబ గద్వాల   3

కామారెడ్డి   4

కరీంనగర్   58

ఖమ్మం   59

కొమరం భీం ఆసిఫాబాద్ 4

మహబూబ్ నగర్   8

మహబూబాబాద్  28

మంచిర్యాల  51

మెదక్  6

మేడ్చల్ మల్కాజ్ గిరి    35

ములుగు  21

నాగర్ కర్నూల్  8

నల్లగొండ  62

నారాయణపేట  4

నిర్మల్  3

నిజామాబాద్  7

పెద్లపల్లి  50

రాజన్న సిరిసిల్ల    26

రంగారెడ్డి  35

సంగారెడ్డి  9

సిద్దిపేట  29

సూర్యాపేట 33

వికారాబాద్ 4

వనపర్తి  19

వరంగల్ రూరల్  10

వరంగల్ అర్బన్ 47

యాదాద్రి భువనగిరి  23

13 జిల్లాల్లో సింగిల్ డిజిట్ కేసులు

ఇవాళ జారీ అయిన బులిటెన్ లో చూస్తే 13 జిల్లాల్లో సింగిల్ డిజిట్ కేసులు నమోదయ్యాయి. మిగతా జిల్లాలన్నీ డబుల్ డిజిట్ కేసులు ఉన్నాయి.

ఇవాళ మొత్తం 103398 టెస్టులు జరిపారు. ఇవాళ కరోనా నుంచి 1061 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 11704 ఉంది. ఇవాళ మరణాల సంఖ్య 7 గా నమోదైంది.

ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 627498 నమోదు కాగా 612096 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు మరణాల సంఖ్య 3698 గా నమోదైంది.

ఇక పెండింగ్ లో ఉన్న టెస్టుల సంఖ్య 729.