వినడానికే కన్నీరు వస్తుంది – ఈ పాప రాయిగా మారుతోంది అరుదైన వ్యాధి

శరీరాన్ని రాయిగా మారుస్తుందని చెబుతున్నారు

0
42

మనం పురాణాల్లో సినిమాల్లో చూశాం. మనిషిని రాయిగా, చెట్టుగా మారిపోమని శాపాలు విధించడం. కానీ నిజ జీవితంలో ఓ సంఘటన జరిగింది. అయితే ఆ చిన్నారి పుట్టిన తర్వాత ఆమె ఈ వ్యాధితో బాధపడుతోంది.యునైటెడ్ కింగ్డమ్లోని ఓ ఐదు నెలల పసికందు రోజు రోజుకు రాయిగా మారిపోతుంది. వినడానికి మనసుకి ఏదోగా ఉంది. కాని ఆ ఆ చిన్నారి ఈ వింత వ్యాధితో ఇబ్బంది పడుతోంది. ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని కలిచివేస్తోంది.

లెక్సీ రాబిన్స్ అనే ఈ పాప 31 జనవరి 2021 న జన్మించింది. పుట్టాక ఆమె బొటనవేలును కూడా కదల్చలేదు.
దీంతో వైద్యులు పరీక్షలు చేశారు. ఫైబ్రోడిస్ప్లాసియా ఓసిఫికన్స్ ప్రోగ్రెసివా అనే తీవ్రమైన సమస్య ఉన్నట్లు వైద్యులు చెప్పారు. అంతేకాదు ఈ వ్యాధి ఉంటే రోగి అస్థిపంజరం బయట కూడా ఎముక ఏర్పడటం ప్రారంభమవుతుంది. శరీర కదలిక ఆగిపోతుంది. ఈ వ్యాధి కండరాలు, కణజాలాలను ఎముకగా మారుస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.

ఇలా శరీరాన్ని రాయిగా మారుస్తుందని చెబుతున్నారు.ఈ రోగులు 20 సంవత్సరాల వయస్సు వరకు పూర్తిగా మంచం మీదే ఉంటారు. సుమారు 40 సంవత్సరాలు బతికుండే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. పాపం ఆ చిన్నారికి ఇంజెక్షన్లు కూడా ఇవ్వలేరు. దీనిపై మరిన్ని పరిశోధనలు జరుగుతున్నాయి.