హస్తినకు చేరుకున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బిజెపి జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన చట్టంలో పెండింగ్‌లో ఉన్న అంశాలపై చర్చించనున్నట్టు సమాచారం. జగన్ వెంట వైసిపి ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, రఘురామకృష్ణం రాజు, అవినాశ్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. ఈ రోజు రాత్రి జన్‌పథ్ రోడ్డులోని నివాసంలో సీఎం జగన్ బస చేయనున్నారు.
శనివారం జరిగే వైసిపి పార్లమెటరీ పార్టీ భేటీలో పాల్గొననున్న ముఖ్యమంత్రి,. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్నారు. శనివారం మధ్యాహ్నం జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో జగన్ పాల్గొంటారు.