సాహో లో ఆ ఒక్క సీన్ కోసం 90 కోట్లు ఖర్చు పెట్టారట..!!

సాహో లో ఆ ఒక్క సీన్ కోసం 90 కోట్లు ఖర్చు పెట్టారట..!!

0
78

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘సాహో’ సినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. నిన్న విడుదలైన ‘సాహో’ సినిమా టీజర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేవలం రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ టీజర్.. ఈ సినిమా ఎలా ఉండబోతోందో కళ్లకు కట్టినట్లు చూపించింది. ఈ సినిమాలో హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని టీజర్ చూస్తే అర్థమవుతోంది.

ముఖ్యంగా ప్రభాస్ వెనుక రెండు పెద్ద ట్రక్కులు చేస్ చేస్తున్న ఆ సీన్ చాలా అద్భుతంగా వచ్చింది. ఫ్లై ఓవర్ మీద సాగే ఆ సన్నివేశాన్ని దుబాయ్ లో 90 కోట్లు పెట్టి చిత్రీకరించినట్లు తెలుస్తోంది. టీజర్లో కేవలం కొన్ని సెకన్లు మాత్రమే మనకు కనిపించిన ఈ సన్నివేశానికి సినిమాలో మాత్రం 15 నిమిషాల నిడివి ఉండబోతుందట. ఈ సీన్ సినిమాలో హైలైట్ గా మారబోతోందని తెలుస్తోంది. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ కెన్నీ బేట్స్ ఈ సినిమా కి అద్భుతమైన కొరియోగ్రఫీ అందించారట. యువీ క్రియేషన్స్, టి సిరీస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల కాబోతోంది.