వైసిపి కి బాలయ్య భలే కౌంటర్‌ ఇచ్చాడుగా..!!

వైసిపి కి బాలయ్య భలే కౌంటర్‌ ఇచ్చాడుగా..!!

0
45

ఏపీ రాజకీయాల్లో బంట్రోతు వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేలకు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కౌంటర్ ఇచ్చారు. టీడీపీ ఎమ్మెల్యేలను బంట్రోతు అనడం సరికాదన్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రజాప్రతినిధులంతా ప్రజలకు బంట్రోతులే అని బాలయ్య చెప్పారు. ప్రజల ద్వారా ఎన్నికైన వారందరూ ప్రజలకు సేవ చేయాల్సిందే అని బాలకృష్ణ స్పష్టం చేశారు.

అధికార పక్షానికి చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ‘అచ్చెన్నాయుడు చంద్రబాబుకు బంట్రోతు’ అని కామెంట్ చేయడంపై స్పందించాలని మీడియా వారుకోరగా…..’రాజకీయ నేతలంతా ప్రజల బంట్రోతులే’ అంటూ బాలయ్య తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు.

ఇక ‘ఎన్టీఆర్ బయోపిక్’ తర్వాత బాలయ్య చేయబోయే 105వ చిత్రం గురువారం ప్రారంభం అయింది. సి కళ్యాణ్ నిర్మాతగా హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.5గా రూపొందుతున్న ఈ చిత్రానికి కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముహూర్త సన్నివేశానికి వి.వి.వినాయక్‌ క్లాప్‌ కొట్టగా, బోయపాటి శ్రీను కెమెరా స్విచ్‌ ఆన్‌ చేశారు. కోదండరామిరెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు.