రాగి పాత్రల్లో వంటలు చేస్తున్నారా చాలా డేంజర్

Doing dishes in copper pots is very dangerous

0
110

మనం ఇప్పటికీ కొందరి ఇళ్లల్లో రాగి గ్లాసులు, రాగి పాత్రలు చూస్తు ఉంటాం. అయితే రాగి చెంబుతో మన పెద్దలు నీరు పోసుకుని తాగేవారు. అందులో రాగికి యాంటి బ్యాక్టిరియల్ నేచర్ ఉందని, అందుకే రాగి తో తయారు అయిన పాత్రలలో బ్యాక్టీరియా చేరదని చెబుతారు. నీటిని అందులో వేసుకుని తాగడం వల్ల ఎలాంటి జబ్బులు వచ్చేవి కావు.

వైద్యులు ఓ విషయం చెబుతున్నారు. రాగిపాత్రల్లో వంట అంత మంచిది కాదని చెబుతున్నారు. ముఖ్యంగా రాగిపాత్రల్లో వండినప్పుడు, నిలువ చేసినప్పుడు కొన్ని పదార్థాలు నెగిటివ్ రియాక్షన్ ని ఇస్తాయట. పాలు వెన్న, ను రాగి పాత్రలో నిల్వచేసినప్పుడు అది రాగిపాత్రల్లో వంట అయ్యే అవకాశం ఉంటుంది అంటున్నారు. ఇక పచ్చళ్లు కూడా అందులో నిల్వ చేయకూడదు.

రాగి మన శరీరంలోకి చేరడం వలన అనేక రకాల ఇబ్బందులు కలుగుతాయి. ముఖ్యంగా జీర్ణాశయ సమస్యలు వస్తాయి . పొట్టలో గ్యాస్, వాంతులు, విరేచనాలు తిమ్మిరి కడుపులో పుండ్లు ఇలాంటి సమస్యలు వస్తాయి. అయితే రాగి చెంబు, రాగి గ్లాసులో నీరు మాత్రమే తాగాలి అని చెబుతున్నారు నిపుణులు. వాటిని వంటకి వాడవద్దు అంటున్నారు. ఇలా రాగి చెంబులో నీరు తాగితే క్యాన్సర్ కూడా రాకుండా ఉంటుందట.