హిందువులు ఎక్కువగా ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే

Who is the God most worshiped by Hindus?

0
33

హిందువులకు ముక్కోటి దేవతలు ఉంటారు. ఇక ఎన్నో పండుగలు ఉంటాయి. ఎన్నో పూజలు, అభిషేకాలు చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కో దేవుడ్ని బాగా నమ్ముకుంటారు. ఇష్టదైవం, కులదైవంగా చేసుకుంటారు. ఇక ప్రతీ గ్రామంలో ఎన్నో ఆలయాలు ఉంటాయి. ఇతర దేశాల్లో కూడా హిందూ ఆలయాలు కొన్ని వేలల్లో ఉన్నాయి.

తాజాగా అమెరికాకు చెందిన పీవ్ రీసర్చ్ సెంటర్ ఇండియాలో ఉన్న వివిధ మతాలపై సర్వే చేపట్టింది. దేశంలో హిందువులు ఎక్కువగా కొలుస్తున్న ఇష్ట దైవాలపై సర్వే చేశారు. ఎక్కువగా హిందువులు శివుడ్ని కొలుస్తున్నారట. దాదాపు సర్వేలో 45 శాతం మంది శివుడ్ని కొలుస్తున్నాం అని తెలిపారు.

తర్వాత హనుమాన్, గణేశ్, లక్ష్మీదేవి, కృష్ణుడు, కాళీమాత, రాముడు ఉన్నారు. విశేషం ఏమిటి అంటే హనుమంతుడికి 32 శాతం మంది భక్తులు ఉండగా, రాముడిని 17 శాతం మంది భక్తులు పూజిస్తున్నారు. ఇక ఈ సర్వే 2019 నుంచి 2020 మధ్య కాలంలో నిర్వహించారు. మొత్తం 30 వేల మంది నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు.