మన తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు ఎంతో మంది దేశ రాజకీయాల్లో ఎన్నో కీలక పదవులు చేపట్టారు. అత్యున్నత పదవులు చేశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు నాయకులు గవర్నర్లుగా సేవలందించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు తొమ్మిది మంది తెలుగు వారు పలు రాష్ట్రాల్లో గవర్నర్లుగా పదవులు చేపట్టారు. మరి వారు ఎవరు అనేది ఓసారి ఈ స్టోరీలో చూద్దాం.
నేడు తెలుగు వ్యక్తి కంభం పాటి హరిబాబును మిజోరాం గవర్నర్గా నియమించారు.
1. రోశయ్య (తమిళనాడు)గవర్నర్ గా చేశారు.
2.వి రామారావు (సిక్కిం)
3. కోన ప్రభాకరరావు (పాండిచ్చేరి, మహారాష్ట్ర)
4. మర్రి చెన్నారెడ్డి (యూపీ, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు)
5.బండారు దత్తాత్రేయ (హిమాచల్ప్రదేశ్, హర్యానా)
6. సీహెచ్ విద్యాసాగర్రావు (మహారాష్ట్ర, 1 సం. తమిళనాడు అదనపు బాధ్యతలు)
7. విఎస్ రమాదేవి (హిమాచల్ప్రదేశ్, కర్ణాటక)
8. పెండేకంటి వెంకట సుబ్బయ్య (బీహార్, కర్ణాటక)
9. కేవీ కృష్ణారావు (కాశ్మీర్, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర)