హైదరాబాద్ లో తగ్గిన కరోనా కేసులు : బులిటెన్ రిలీజ్, 14 జిల్లాల్లో సింగిల్ డిజిట్

Telangana Corona cases bulletin released

0
35

తెలంగాణలో బుధవారం కరోనా కేసులు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. నేటి కోవిడ్ బులిటెన్ రిలీజ్ అయింది. ఇవాళ కోవిడ్ పాజిటీవ్ కేసులు 772 మాత్రమే నమోదు కావడం ఊరటనిచ్చే అంశంగా చెప్పవచ్చు. నిన్నటితో 784తో పోలిస్తే స్వల్పగా కేసులు తగ్గాయి. అయితే అన్ని జిల్లాల్లో డబుల్ డిజిట్ లోనే కేసులు నమోదు కావడం గమనార్హం. హైదరాబాద్ లో ఇవాళ కూడా డబులు డిజిట్ లోనే కేసులు 88 మాత్రమే నమోదయ్యాయి. మరణాల సంఖ్య ఇవాళ కూడా 7 గా నమోదైంది. ఇవాళ చేసిన మొత్తం పరీక్షల సంఖ్య 110141. నేడు రికవరీ అయిన వారి సంఖ్య 748. పెండింగ్ లో ఉన్న టెస్టుల సంఖ్య 1193.

నేడు జారీ అయిన బులిటెన్ లో జిల్లాల వారీగా కేసుల వివరాల జాబితా కింద ఉంది చూడొచ్చు.
ఆదిలాబాద్ 3
కొత్తగూడెం 28
జిహెచ్ఎంసి 88
జగిత్యాల 18
జనగామ 6
జయశంకర్ భూపాలపల్లి 16
జోగులాంబ గద్వాల 1
కామారెడ్డి 2
కరీంనగర్ 48
ఖమ్మం 86
కొమరం భీం ఆసిఫాబాద్ 4
మహబూబ్ నగర్ 8
మహబూబాబాద్ 33
మంచిర్యాల 47
మెదక్ 4
మేడ్చల్ మల్కాజ్ గిరి 35
ములుగు 18
నాగర్ కర్నూల్ 8
నల్లగొండ 57
నారాయణపేట 4
నిర్మల్ 4
నిజామాబాద్ 8
పెద్లపల్లి 41
రాజన్న సిరిసిల్ల 16
రంగారెడ్డి 35
సంగారెడ్డి 10
సిద్దిపేట 21
సూర్యాపేట 37
వికారాబాద్ 3
వనపర్తి 9
వరంగల్ రూరల్ 6
వరంగల్ అర్బన్ 51
యాదాద్రి భువనగిరి 17

ఇవాళ 14 జిల్లాల్లో సింగిల్ డిజిట్ కేసులు మాత్రమే నమోదు కాగా మిగిలిన జిల్లాల్లో డబుల్ డిజిట్ కేసులు వచ్చాయి.

 

ఈ వార్త కూడా చదవండి….

Big Breaking : కాంగ్రెస్ లో కోదండరాం జన సమితి విలీనం ?