శేఖర్ కమ్ములతో చైతు.. హీరోయిన్ గా మలయాళ నటి..!!

శేఖర్ కమ్ములతో చైతు.. హీరోయిన్ గా మలయాళ నటి..!!

0
92

టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల విభిన్నమైన లవ్ స్టోరీతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ద్వారా ఆయన కొత్త హీరో హీరోయిన్లను పరిచయం చేస్తూ.. ఉన్నారు. అయితే ఈసినిమా షూటింగ్ కూడా కొంత జరిగింది. కానీ.. ఈ సినిమాకు సంబంధించి హీరో హీరోయిన్లు డాన్స్ లో శిక్షణ తీసుకోవలసిన అవసరం రావడంతో షూటింగుకు ఒక మూడు నెలల పాటు విరామం ఇవ్వనున్నారు.

ఈ గ్యాప్ లో ఆయన చైతూ – సాయిపల్లవి నాయకా నాయికలుగా ఒక ప్రాజెక్టును పట్టాలెక్కించే ప్రయత్నాలు చేస్తున్నాడని సమాచారం. ఇక గతంలో శేఖర్ కమ్ముల – సాయిపల్లవి కాంబినేషన్లో వచ్చిన ‘ఫిదా’ భారీ విజయాన్ని నమోదు చేయడంతో, సహజంగానే ఈ ప్రాజెక్టుపై అంచనాలు పెరిగే అవకాశం వుంది. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.