టీడీపీ కి చుక్కలు చూపించిన అంబటి రాంబాబు..!!

టీడీపీ కి చుక్కలు చూపించిన అంబటి రాంబాబు..!!

0
51

వైసీపీ ఫైర్ బ్రాండ్ అంబటి రాంబాబు తన పంచులతో టీడీపీకి చుక్కలు చూపించారు. టీడీపీ నేతలు పరమానందయ్య శిష్యుల తరహాలో నారానందయ్య శిష్యులు మాదిరి తయారైనట్లుగా వ్యంగ్య వ్యాఖ్యలు చేసి నవ్వులు తెప్పించారు అంబటి రాంబాబు. తాను టీడీపీ ఎమ్మెల్యేలను అవమానించాలనో.. అగౌరవ పర్చాలన్న ఉద్దేశంతోనో తానీ వ్యాఖ్యలు చేయటం లేదన్న ఆయన.. చంద్రబాబును గన్నవరం ఎయిర్ పోర్ట్ లో తనిఖీలు చేసిన అంశంపై టీడీపీ నేతల ప్రచారాన్ని ఆయన భారీ కౌంటర్లు వేశారు.

ఎయిర్ పోర్టులో బాబును తనిఖీ చేసినంతనే టీడీపీ నేతలంతా.. సుబ్బారావుగారూ.. మీ లీడర్కు అన్యాయం జరిగిపోయిందండీ.. వెంకటరావు గారూ.. మీ లీడర్ ను అవమానించారండీ.. అంటూ నిద్రపోయే వారిని లేవగొట్టి మరీ చంద్రబాబుకు అవమానం జరిగినట్లుగా చెప్పుకున్నారన్నారు.నిజానికి చంద్రబాబుకు అన్యాయం జరగలేదు.. అవమానం జరగలేదు.. ప్రతిపక్ష నేతల విషయంలో ఎలాంటి రూల్స్ పాటించాలో అలాంటి రూల్సే సిబ్బంది ఫాలో అయ్యారు.