సైరా ట్రైలర్ కి ముహూర్తం కుదిరింది…!!

సైరా ట్రైలర్ కి ముహూర్తం కుదిరింది...!!

0
83

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రలో నటిస్తోన్న `సైరా` ట్రైలర్ రిలీజ్ కు డేట్ ఫిక్సయినట్లు తెలుస్తోంది. ఇది చిరంజీవి హీరోగా నటిస్తున్న 151వ చిత్రమని తెలిసిందే. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రంతో `సైరా నరసింహారెడ్డి` సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, సుదీప్ , జగపతిబాబు తదితరులు ముఖ్యతారాగణం `సైరా` చిత్రం టీజర్ ను గతంలోనే విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా ట్రైలర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. చిరంజీవి పుట్టినరోజు (ఆగష్టు 22) న ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వస్తుందని వార్తలు వస్తున్నాయి.