అమ్మాయి ప్రేమ కోసం క్షుద్ర పూజలు : తుదకు ఏమైందంటే ?, నల్లగొండలో కలకలం

witchcraft for love

0
104

అమ్మాయిని ప్రేమించాడు. వెంటపడి వేధించాడు. ఆమె దారికి రాలేదు. ఎలాగైనా ఆమెను జయించాలనుకున్న ఆ యువకుడు తుదకు క్షుద్ర పూజలు చేశాడు. తుదకు పోలీసులు రంగంలోకి దిగి ఆ యువకుడిని అరెస్టు చేసి కటకటాల వెనక్కు నెట్టేశారు. నల్లగొండ పోలీసులు మీడియా సమావేశంలో వెల్లడించిన పూర్తి వివరాలు ఇవీ…

ఈనెల 7వ తేదీన నల్లగొండ జిల్లా గుండ్రాంపల్లి గ్రామంలో తెల్లవారుజామున పోల్లోజు వేంకటాచారి ఇంటి గేటు దగ్గర చేతబడులకు సంబందించిన వస్తువులు (ఎముక, జాకెట్ ముక్కలు , బియ్యం, కుంకుమ, గాజులు, జీడిగింజలు, వెంట్రుకలు, నిమ్మకాయలు మొదలైనవి)కనబడ్డాయి. దీంతో ఆ కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంగటనాస్థలానికి చేరుకొని గ్రామస్తులు ఎవరు ఆందోళన చెందవద్దని, నేరస్థున్ని ఎలాగైనా పట్టుకుంటామని పోలీసులు భరోసా కల్పించారు. వెంటనే కేసు నమోదు చేసి గ్రామంలో ఉన్న సి‌సి కెమరాలు ఆధారంగా cell tower data ఆధారంగా ఫిర్యాది కుటుంబ సభ్యుల విచారణ ఆధారంగా ఇవాళ ఉదయం 8 గంటలకి ఇట్టి చర్యలను చేసిన నింధితుణ్ణి మునుగోడు బైపాస్ వద్ద అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడి పేరు కూడతల మురలి s/o ఈశ్వరయ్య వయస్సు:30 ఏళ్లు. ప్రియవేటు జాబ్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఉండేది రంగారెడ్డి నగర్ అని సమాచారం ఇచ్చాడు. 9 నెలల క్రితం అనుకోకుండా wrong number కు dail చేయగా సదరు అమ్మాయి అతడికి పరిచయం అయింది. అప్పటినుండి కాల్స్, మెసేజీలు చేస్తుండేవాడు.

ఆ పరిచయం లో భాగంగా ఆమెపై ఇష్టం పెరిగి ప్రేమిస్తున్నాను అని చెప్పగా సదరు మహిళా ఒప్పుకోలేదు. కొద్ది రోజుల తర్వాత ఆ మహిళకు వివాహం అయినదని తెలిసి, ఎలాగైనా సరే ఆమెను దక్కించుకోవాలని ఆమె కొత్త సంసారం చెడగొట్టాలని నిర్ణయించుకొన్నాడు. యూట్యూబ్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియాలో లో చూపిన వీడియొలా ఆధారంగా చేతబడి వంటివి చేస్తే భయపడి ఆ అమ్మాయి భర్తతో విడిపోతుందని భావించాడు. గత నెల 18వ తేదీన సదరు అమ్మాయి ఇంటి ముందు కుంకుమ, పసుపు జీడి గింజలు ఉంచాడు. తర్వాత ఆ మహిళ భర్తకి ఫోన్ చేసి తిట్టి బెదిరించాను.

nalgonda police press meet

మళ్ళీ ఈనెల 6వ తేదీన రాత్రి సుమారు 12.00 గంటల సమయంలో బైక్ పై గుండ్లపల్లి వచ్చి ఇంటి ముందర గేటు దగ్గర, ముందే కల్పుకున్న (ఎముకలు, కుంకుమ, జీడిగింజలు, గవ్వలు, నిమ్మకాయలు, వెంట్రుకలు, వక్కలు, తెల్ల , నల్లటి గుడ్డ ముక్కలు ,కుంకుమ మరియు పసుపు కల్పిన బియ్యం ) వస్తువులను గేటు దగ్గర పెట్టాడు. తరువాత పోలీసులు గుండ్లపల్లి కి వచ్చి విచారిస్తున్నారని తెల్సుకోని దొరకకుండా పారిపోయాడు. కానీ పోలీసులు ఇవాళ ఉదయం పోలీసులు పట్టుకొని రిమాండ్ కు తరలించారు. ఈ కేసులో ప్రతిభ చూపి నేరస్థుడిని త్వరగా గుర్తించి రిమాండ్ చేసిన నల్లగొండ రూరల్ ఎస్సై రాజశేఖర్ రెడ్డి, కానిస్టేబుళ్లు హట్టి , నాగరాజు, సలీం తదితరులను నల్లగొండ డిఎస్పీ అభినందించినారు.

విలేకరుల సమావేశంలో టూ టౌన్ సిఐ చంద్రశేఖర్ రెడ్డి, రూరల్ ఎస్.ఐ. రాజశేఖర్ రెడ్డి, ట్రైనీ ఎస్.ఐ. రాజశేఖర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.