నేను నీకంటే కట్టర్ హిందువు : 31 గుడులు కట్టించిన

0
37

బాల్కొండ నియోజకవర్గం బాల్కొండ మండల కేంద్రానికి చెందిన వార్డు మెంబెర్ రాజేష్,బీజేపీ పార్టీ జిల్లా కార్యదర్శి హరీష్ ఆధ్వర్యంలో 200 మంది యువకులు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో సోమవారం టిఆర్ఎస్ పార్టీలో చేరారు.గులాబీ కండువా కప్పి వారిని మంత్రి టిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కామెంట్స్

ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జనరంజక పరిపాలన, సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలు నచ్చి బాల్కొండ పంచాయతీ పాలకవర్గ సభ్యుడు రాజేష్,బీజేవైఎం జిల్లా కార్యదర్శి హరీష్ ఆధ్వర్యంలో ఇంత పెద్ద సంఖ్యలో యువకులు మిత్ర యూత్,పటేల్ యూత్,ఆదిత్య యూత్,ఆర్ఎస్ఐ యూత్ సభ్యులు టిఆర్ఎస్ పార్టీలో చేరడం మంచి పరిణామం.

యువతలో మార్పు బాల్కొండ నుండే ప్రారంభం అయ్యిందని నేను భావిస్తున్నా.మీరు నియోజకవర్గ యువకులకు ఆదర్శం.

విద్వేషాలు, సోషల్ మీడియా అబద్ధాల ప్రచారాల మధ్య నుంచి అభివృద్ధి వైపు రావడం మీరు తీసుకున్న గొప్ప నిర్ణయం.

నేను ఎప్పుడు నియోజకవర్గం వచ్చిన 20 నుంచి 30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు,ప్రారంభోత్సవాలు చేస్తా…

నేను నియోజకవర్గ అభివృద్దే తప్పా సోషల్ మీడియా ప్రచారాలు పట్టించుకోను.

ముఖ్యంగా యువత సోషల్ మీడియాలో వచ్చే సెన్సేషన్ కి ఆకర్షితులు అవుతున్నారు.

అదే నిజం అనేలా యువతను మాయమాటలతో నమ్మిస్తున్నారు.

అభివృద్ధి పనులు,మంచి చేసేపనులు సోషల్ మీడియాలో ప్రచారం కావు.అభివృద్ధి విషయాలు వైరల్ కావడం లేదు.

దాని నుంచి యువత బయటకు రావాలి.నిజాలు గ్రహించాలి. ఇవాళ బాల్కొండ యువత ఒక అడుగు ముందుకేసి అభివృద్ధి వైపు… వచ్చారు… నియోజకవర్గ యువకతకు ఆదర్శం.

కేసీఆర్ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు.. రైతుబంధు,రైతు భీమా,24గంటలనాణ్యమైన ఉచిత విద్యుత్,
ఆసరా పెన్షన్,కళ్యాణాలక్ష్మి, కేసీఆర్ కిట్,డబుల్ బెడ్రూం ఇండ్లు లాంటి సంక్షేమ కార్యక్రమాలు బీజేపీ,కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రాల్లో ఎందుకు లేవు.

గతంలో నీళ్లచారు,ముక్కిపోయిన బియ్యం హాస్టల్లో ఉండేది.

ఇప్పుడు సన్నబియ్యంతో రోజు గుడ్డు పౌష్టికాహారంతో భోజనం పెట్టి నాణ్యమైన విద్యను రెసిడెన్షియల్ స్కూల్స్ ద్వారా అందిస్తున్నాం.

బండి సంజయ్,రేవంత్ రెడ్డి,అర్వింద్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.

వారు నేను అడిగిన వాటికి సమాధానం చెప్పాలి.

ప్రజలకోసం పనిచేయడానికే ప్రజాస్వామ్యం…అందుకే రాజకీయ పార్టీలు ఉన్నాయి.చిల్లరమల్లర రాజకీయాల కోసం కాదు.

నేను హిందువునే.. ఎంపీ అర్వింద్ హిందువే.

నేను 31 గుడులు కట్టించిన.. నీవు ఒక్క గుడి అయిన కట్టించినవ అర్వింద్.

జై శ్రీరాం అని హృదయం లోంచి రావాలి..ఊరికే మాట్లాడడం కాదు.

నేను నీ కంటే కట్టర్ హిందువు అయినా కూడా… అన్ని మతాల ప్రజలను నేను ప్రేమిస్తా….గౌరవిస్తా

యువత కూడా ఆ మాయలో పడొద్దు…ఫేక్ సోషల్ మీడియా నమ్మొద్దు.
డబుల్ బెడ్రూం ఒక్క ఇంటికోసం 5లక్షల 80 వేలు ఖర్చు అవుతుంది.

అందులో మోడీ ఇస్తా అన్నది 72వేలు రూపాయలు మాత్రమే.

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో డబుల్ బెడ్రూం ఇండ్లు అసలే ఉండవు.

2000 వేల పెన్షన్ కోసం సంవత్సరానికి 8వేల కోట్లు ఖర్చు అయితే కేంద్రం ఇచ్చేది 200 కోట్లు..

కేంద్రంమే అన్ని ఇస్తుందని అంటున్నారు… మరి తెలంగాణ లో ఉన్నట్లు ప్రతి గ్రామంలో ట్రాక్టర్, ట్రాలీ,వాటర్ ట్యాంకర్,డంపింగ్ యార్డులు, వైకుంఠ దామాలు, పల్లె ప్రకృతి వనాలు మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు లేవు…

దీనిపై సమాధానం ఉండదు..

దుబ్బాక లో ఇట్లనే చెప్పినారు..ఇప్పుడు హుజురాబాద్ లో కూడా చెప్తారు..అన్ని మేమే ఇస్తున్నాం అని

అన్ని అబద్దాలు.. అసత్య ప్రచారాలు..

పాత బీజేపీ మంచిగుండే…ఇప్పుడు మంచిగలేదు..

అద్వానీ, వాజ్ పాయ్ విలువలతో కూడిన రాజకీయాలు చేశారు..వారు నమ్మిన సిద్ధంతం కోసం పనిచేశారు..వారంటే గౌరవం ఉన్నది..

ఇప్పుడు కొత్త పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సారధ్యంలో కాంగ్రెస్ కూడా అబద్ధాల్లో ట్రెండింగ్ లో ఉన్నది.

అవన్నీ నమ్మి మోసపోవద్దు

తెలంగాణ ప్రజలకు కావాల్సిన అన్ని పనులు కేసీఆర్ కచ్చితంగా చేస్తారు.