భారత్ లో సెకండ్ వేవ్ ఎలా విజృంభించిందో ఇప్పుడు అలాగే ఇండోనేషియాలో

How the second wave boomed in India is now as well as in Indonesia

0
39

మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఎంతలా విజృంభించిందో తెలిసిందే. రోజూ నాలుగు లక్షలకు పైగా కేసులు వచ్చాయి. ఆక్సిజన్ కు తీవ్ర కొరత ఏర్పడింది. ఆక్సిజన్ సకాలంలో అందక చనిపోయిన వాళ్లు ఎందరో ఉన్నారు.ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, కొరత చాలా ఏర్పడింది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు ఇండోనేషియాను వెంటాడుతున్నాయి.

భారత్ ఆక్సిజన్ కొరతతో సతమతం అవుతుంటే వేల ట్యాంకుల కొద్దీ ఆక్సిజన్ అందించిన ఇండోనేషియా ఇప్పుడు ఆక్సిజన్ లేక ఇబ్బంది పడుతోంది. దేశంలో కేసులు పెరగడంతో అక్కడ ఆక్సిజన్ కు ఎంతో డిమాండ్ ఏర్పడింది. జనాభాలో చూసుకుంటే ఇండోనేషియా నాల్గో స్ధానంలో ఉంది. కరోనా కేసులతో ఆస్పత్రుల్లో రోగులు వస్తున్నారు. ఇప్పుడు చైనా, సింగపూర్ వంటి దేశాల వైపు చూస్తోంది ఇండోనేషియా.

ఇక మిగిలిన దేశాలు కూడా సాయం అందిస్తున్నాయి. ఇక చాలా మంది ఆక్సిజన్ అవసరం లేకపోయినా కొనుగోలు చేసి పక్కన పెట్టుకుంటున్నారు. ప్రభుత్వం పరిశ్రమల నుంచి మెడికల్ ఆక్సిజన్ తీసుకుంటోంది. రోజుకి ఏకంగా 50 వేల కేసులు నమోదు అవుతున్నాయి. వచ్చే రెండు వారాలు మరింత కీలకం అంటున్నారు నిపుణులు.