మొసలి అనే మాట వింటేనే మనకు టెన్షన్ వస్తుంది. ఇక మన ముందు అది కనిపిస్తే వెంటనే అక్కడ నుంచి పరుగు తీస్తాం. ఇక జూకు వెళ్లినా ఎక్కడైనా మొసలిని చూసినా గుండెలు అదిరిపోతాయి. మనకు అది కనిపించింది అంటే మాములు టెన్షన్ ఉండదు. అయితే కొందరికి అవి చాలా మచ్చిక అవుతాయి. వారి దగ్గరకు వెళ్లినా అస్సలు ఏమీ అనవు. ముఖ్యంగా సర్కర్ ఫీట్లు చేసే కొందరిని చూస్తు ఉంటాం. ఇక్కడ నదిలో ఓ మొసలి ఏం చేసిందో చూద్దాం.
ఓ వ్యక్తి నది మధ్యలో స్విమ్మింగ్ చేస్తున్నాడు. ఇదే సమయంలో ఆయనవైపు ఓ మొసలి ఈదుతూ వేగంగా దూసుకొచ్చింది.
ఇక అతను కూడా భయపడి బయటకు వస్తాడు అని అందరూ అనుకుంటారు. కాని అతను అక్కడే ఉన్నాడు .ఆ మొసలి దగ్గరకు వచ్చింది. దానిని చేతుల్లోకి తీసుకుని భుజం పై వేసుకున్నాడు. అది కూడా ప్రేమతో చంటిబిడ్డలా ఎక్కేసింది.
ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. అంతటి క్రూర జంతువు ఇలా ప్రేమగా ఎలా మారిందన్న దానిపై నెటిజన్లు షాక్ అయ్యారు. అయితే వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉండి ఉండవచ్చు అని కామెంట్ చేస్తున్నారు. మీరు ఈ వీడియో చూసేయండి.
https://www.instagram.com/p/CRUBtKKn6Pp/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again