పులస ప్రియులకి గుడ్ న్యూస్ – పులసలు వచ్చేశాయ్

Good news for Pulsa lovers

0
42

పులస చేపల కోసం ఎంతో మంది చూస్తారు. ఈ సీజన్ వచ్చింది అంటే పులస తినాల్సిందే. ఇక గోదావరి జిల్లాల వారిని చాలా మంది అడుగుతూ ఉంటారు. పులస ఉంటే పంపండి అని. ఇక డిమాండ్ ఎక్కువ ఉండటంతో దీని కోసం చాలా మంది క్యూ కడతారు. మత్స్యకారులకి ముందు అడ్వాన్స్ ఇచ్చి పులస పడితే మాకు ఇవ్వు అని కోరతారు. ఇక ఈ నెలలు పులస రాకతో ఇటు మత్స్యకారులు కూడా లక్షాదికారులు అవుతారు.

అయితే పులస సీజన్ ప్రారంభం కావడంతో ఇటు తూ.గో -ప.గో జిల్లాల్లో సందడి మొదలైంది. గతేడాది పులస చేప ధర గరిష్ఠంగా రూ. 18 వేలు పలికింది. ఇప్పుడు ఎంత ధర పలుకుతుందా అని చూస్తున్నారు అందరూ. ఇక పులస టేస్ట్ ఎంత బాగుంటుందో తెలిసిందే. ఏకంగా గోదావరి జిల్లాల నుంచి హస్తిన వరకూ పులస చేపలు వెళతాయి.

గౌతమి, వృద్ధ గౌతమి, వశిష్ఠ, వైనతేయ గోదావరి నదుల్లో చేపలు ప్రయాణిస్తూ ధవళేశ్వరం బ్యారేజే గేట్ల ద్వారా భద్రాచలం వరకు ఎదురీదుతూ వెళ్తాయి. ఇక్కడ జాలర్లకు చిక్కుతూ ఉంటాయి. మరి మీరు కూడా పులస తినాలంటే ఈ సీజన్ లో రుచి చూసేయండి.