చైనాలో కొత్త వైరస్ ఇది ఎంత ప్రమాదకరమంటే

The new virus in China - how it is dangerous

0
99

ఈ కరోనా వైర‌స్ తో ఎన్నో ఇబ్బందులు పడుతోంది ప్రపంచం. ఇక చైనాలో తాజాగా మరో వైరస్ వెలుగులోకి వచ్చింది. కోతుల నుంచి మనుషులకు సంక్రమించే మంకీ బి వైరస్ తో ఓ వ్యక్తి మరణించినట్టు చైనా తాజాగా వెల్లడించింది. ఈ వార్త ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయింది. అయితే అతనితో సన్నిహితంగా ఉన్న వారికి ఏమైనా లక్షణాలు ఉన్నాయా అనేది కూడా పరిశోధన చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఎవ‌రికి ఎలాంటి లక్షణాలు లేవు అని తెలిపారు.

బీజింగ్ కు చెందిన ఓ పశువైద్యుడు మార్చిలో రెండు చనిపోయిన కోతుల శరీరాలను ముక్కలుగా చేసి పరీక్షించారు. తర్వాత ఆయ‌న‌ వాంతులు, వికారం వంటి లక్షణాలతో బాధపడ్డారు. దీంతో ఆ డాక్ట‌ర్ మే 27న మరణించాడు. పరీక్షలు చేస్తే ఆయ‌న మంకీ బి వైరస్ కారణంగా మరణించినట్టు నిర్ధారణ అయింది.

చైనాలో ఇంతకుముందు ఇలాంటి వైరస్ ఎవరిలోనూ బయటపడలేదని, ఇప్పటి వరకూ ఉన్న డేటా ప్రకారం ఇదే తొలికేసు అని చెబుతున్నారు. అయితే ఈ కేసు 1932లో మకాక్స్ అనే కోతి జాతిలో గుర్తించారు. కోతుల నుంచి నేరుగా మనుషులకు సంక్రమించే ఈ వైరస్ చాలా ప్రమాదకరమని చెబుతున్నారు నిపుణులు. వెంట‌నే గుర్తించ‌క‌పోతే 80 శాతం వరకూ ప్రాణాలకు ముప్పు ఉంటుంది అని తెలిపారు నిపుణులు.