ఎర్ర బియ్యం తింటే కలిగే లాభాలు ఇవే

These are the benefits of eating red rice

0
124

ఈ రోజుల్లో షుగర్ వ్యాధితో ఎందరో బాధపడుతున్నారు. అందుకే అందరూ ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే రాత్రి పూట కూడా చాలా మంది రైస్ కాకుండా గోధుమలు, కొర్రలు, సజ్జలు, రాగులు ఇలాంటి వాటితో చేసిన ఫుడ్ తింటున్నారు. అయితే ఇప్పుడు ఎర్ర బియ్యం కూడా చాలా మంది తింటున్నారు.

ఈ రైస్ వల్ల ఆస్తమా, కీళ్ల నొప్పులు కూడా తగ్గిపోతాయని, జీర్ణశక్తి కూడా బాగా మెరుగుపడుతుందని నిపుణులు అంటున్నారు. ఇక మంచి పులుసు కూరలతో సాంబారు పెరుగుతో ఈ రైస్ తీసుకోవచ్చు. మొత్తం ఇవి 34 రకాల రైస్ ఉంటాయట.కెంపు, సన్నం, చంద్రకళ, బారాగలి, నవారా ఇవన్నీ ఎర్రబియ్యం రకాలుగా దొరుకుతాయి.

కిలో బియ్యం ధర మార్కెట్లో రూ.120 పలుకుతోంది. ఇక ఇవి తింటే ఆకలి పెద్ద వేయదు. ఇందులోపీచు అధికంగా ఉంటుంది. అంతేకాకుండా విటమిన్ B1, B2, B6లతో పాటు ఐరన్, జింక్, పోటాషియం, సోడియం, కాల్షియం, మాంగనీస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. షుగర్ ఉన్నవారు కూడా ఈ బియ్యం తీసుకోవచ్చు. దీని వల్ల ఐరన్ కూడా బాగా వస్తుంది.