ప్రజావేదికను కూల్చుతుంటే చూడ్డానికి వచ్చినవాళ్లు ఏమనుకున్నారో నువ్వు సరిగా విన్నట్టు లేవు

ప్రజావేదికను కూల్చుతుంటే చూడ్డానికి వచ్చినవాళ్లు ఏమనుకున్నారో నువ్వు సరిగా విన్నట్టు లేవు: విజయసాయిపై వర్ల ఫైర్

0
80

ప్రజావేదిక కూల్చివేత వ్యవహారం అధికార, విపక్షాల మధ్య తీవ్ర వివాదంగా మారింది. తాజాగా ఈ వ్యవహారంలో టీడీపీ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. వైసీపీ అగ్రనేత విజయసాయిరెడ్డిని లక్ష్యంగా చేసుకుని మాటల తూటాలు సంధించారు. నీతినిజాయతీ ఉన్నవాళ్లు తమ ఇంటి నుంచే ప్రక్షాళన మొదలుపెడతారని, మీకు అటువంటి నీతి లేదన్న విషయం ప్రజావేదిక కూల్చివేతతో స్పష్టమవుతోందని విమర్శించారు. ఒకవేళ మీకు అలాంటి నీతి ఉంటే ముందు ఇడుపులపాయలో ఉన్న అక్రమకట్టడాలపై చర్యలు తీసుకోండంటూ సవాల్ విసిరారు.

“ప్రజావేదికను కూల్చుతుంటే చూడ్డానికి వచ్చిన ప్రజలు ఏమనుకున్నారో నువ్వు విన్నట్టు లేవు, పిచ్చోడి చేతికి రాయి ఇచ్చినట్టు వైసీపీకి అధికారం ఇచ్చి తప్పుచేశాం అనుకుంటున్నారు. వైఎస్ పాలనలో అక్రమాలపై మాట్లాడుతుంటే విజయసాయిరెడ్డికి మూర్ఖపు లాజిక్ లా ఉందట! మీ ముఖాన దొంగ అని ముద్రపడింది కాబట్టి అందరికీ అదే ముద్రవేయాలనుకుంటున్న మీరే మూర్ఖులు!” అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.