రాజ్ కుంద్రా అరెస్ట్ తర్వాత శిల్పాశెట్టి ఫస్ట్ రియాక్షన్ – ఏమన్నారంటే

Shilpa Shetty's response after Raj Kundra's arrest

0
84

ఇప్పుడు బీ టౌన్ లో రాజ్ కుంద్రా వ్యవహారం హాట్ టాపిక్ అయింది. బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అవ్వడంతో దీని గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. రాజ్ కుంద్రా ముంబై పోలీసుల కస్టడీలో ఉన్నారు. తన భర్త అరెస్టైన తర్వాత శిల్పాశెట్టి తొలిసారి స్పందించింది.

కోపంలో ఉన్నప్పుడు వెనక్కి చూడకు, భయంగా భవిష్యత్తును చూడకు, పూర్తి అవగాహనతో చుట్టుపక్కల చూడు అంటాడు జేమ్స్ థర్బర్ ఆయన ప్రముఖ రచయిత ఆయన పుస్తకంలో మాటలు ఆమె ఇన్ స్టాలో రాసింది. మనల్ని బాధ పెట్టిన వారి వైపు కోపంతో వెనక్కి తిరిగి చూస్తాం. ఉద్యోగం పోతుందేమో అనే భయంతోనో, ఏదైనా రోగం బారిన పడతామనో, మనకు ఇష్టమైన వ్యక్తిని కోల్పోతామనే భయంతోనో భవిష్యత్తును చూస్తాం. నేను బతికే ఉన్నాననే విషయం తెలుసుకుని దీర్ఘంగా ఊపిరి తీసుకుంటాం ఇలా ఆమె కొన్ని వాక్యాలు రాసింది.

2009లో శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక తరచూ తన యోగా వీడియోలని కూడా ఆమె షేర్ చేస్తుంది. షోలకు జడ్జిగా సినిమాలు కూడా వరుసగా చేస్తోంది.