తెలంగాణ కరోనా మరణాల లెక్కలు దాచిన కేసిఆర్ సర్కారు

0
88

”తన చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం కోవిడ్ మరణాలని తక్కువగా చేసి చూపించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ తప్పుడు లెక్కలనే పరిగణలోకి తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం, కోవిడ్ మరణలపై రాష్ట్రం ఇచ్చిన లెక్కలనే పరిగణిస్తామని పార్లమెంట్ సాక్షిగా చెప్పడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత రాహిత్యానికి నిదర్శనం” అని మండిపడ్డారు ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రావణ్. కోవిడ్ మరణాలని తక్కువ చేసి చూపుతున్న ప్రభుత్వ తీరుని ఎండగడుతూ గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు దాసోజు.

‘తెలంగాణ రాష్ట్రంలో కరోనా కాలంలో దాదాపు లక్షా యాబై వేలమంది చనిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం కేవలం 3710 మంది మాత్రమే చనిపోయారని దొంగలెక్కలు చెబుతుంది. ఇప్పుడీ తప్పుడు లెక్కల్ని సమర్ధిస్తూన్నట్లు కేంద్ర ప్రభుత్వం మాట్లాడటం సిగ్గు చేటు. కోవిడ్ మరణాలపై కేంద్రం అనుసరిస్తున్న విదానాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి దేశ వ్యాప్తంగా ప్రతి జిల్లా హెడ్ క్యార్టర్ లో ఇంటెల్జెన్స్ బ్యూరో డిపార్ట్మెంట్ వుంటుంది. ఐబీ వాళ్ళు ఏం చేస్తున్నారు ? దేశంలో చనిపోయిన ప్రతి ఒక్కరి డాటా ని నమోదు చేసే పాలసీ దేశంలో వుంది. రాష్ట్రం ప్రభుత్వం చెప్పకపోయిన కేంద్రం ఆధీనంలో వున్న ఐబీ డెత్ రిజిస్ట్రేషన్ ద్వారా మరణాల వివరాలు తెలుసుకొని వెసులుబాటు వుంది. కరోనాలో రాష్ట్రంలో లక్షమంది పిట్టల్లా రాలిపోయారు. కానీ కేంద్రం మాత్రం బాధ్యత రాహిత్యంగా రాష్ట్రం చెప్పిన లెక్కలనే పరిగణలోకి తీసువడం సిగ్గు చేటు. చావుల పై అబద్దాలు ఎందుకు ? చావులపై అబద్దాలు ఆడటం అంటే చావులని అగౌరవ పరచడమే. కాబట్టి కోవిడ్ డెత్ ఆడిట్ ని ఏర్పాటు చేసి వాస్తవ మరణాల లెక్కని బయటికి తీసుకురావాలి. ” అని విజ్ఞప్తి చేశారు దాసోజు.

కోవిడ్ సెకండ్ వేవ్ లో రాష్ట్రంలో లక్షల మరణాలు సంభవించాయి. కోవిడ్ సోకి ఆక్సిజన్ అందక, బెడ్లు దొరకక, వైద్యం అందక లక్షల మంది పిట్టాలా రాలిపోయారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం కేవలం 3710 మంది మాత్రమే చనిపోయారని తప్పుడు లెక్కలు చెబుతుంది. తెలంగాణ రాష్ట్రంలో 6లక్షల 59వేల 24 పాజిటివ్ కేసులకు 3710 మంది చనిపోయారని ప్రభుత్వం చెబుతుంది. అసలు టీఆర్ఎస్ ప్రభుత్వానికి సిగ్గువుందా ? రాజకీయంలో వున్న వ్యక్తులు వారి స్వలాభం కోసం అబద్దాలు ఆడితే ఆడవచ్చు కానీ ఆరోగ్య శాఖలోని అధికారులు కూడా భాద్యతలేకుండా అబద్ధాలు చెప్పడం దుర్మార్గం. అందరూ కలసి అబద్దాల కోరులుగా మారిపోయారు. చనిపోయినవారి సంఖ్యని తక్కువ చూపడం ఎందుకు ? ప్రభుత్వ, ఆధికారుల బాధ్యత రాహిత్యం వలన కోవిడ్ బాదిత కుటుంబాలకు తీరని అన్యాయం జరుగుతుంది. మహారాష్ట్రలో 61,22, 983 పాజిటివ్ కేసులు, 1,23,857 మరణాలు, కర్ణాటక 28,62,338 కేసులు, 35,601 మరణాలు, ఆంధ్రప్రదేశ్, 19,11,231 కేసులు 12919 మరణాలు, కేరళ 30,11,694 కేసులు 14,108 మరణాలు, ఒరిస్సా 9,29,788 కేసులు 4358 మరణాలు, పంజాబ్ 5,96,970 కేసులు 16,141 మరణాలు, రాజస్థాన్ 9,52,887 కేసులు 8942 మరణాలు,జమ్మూ కాశ్మీర్ 3,17,761 కేసులు 4349 మరణాలు, ఢిల్లీ లో 14,34,780 కేసులు 25005 మరణాలు, చివరికి తెలంగాణతో పోల్చుకుంటే చిన్న రాష్ట్రమైన ఛత్తిష్ ఘడ్ 9,96,689 కేసులు 13,464 మరణాలు సంభవించినట్లు గణాంకాలు చూపిస్తుంటే తెలంగాణలో మాత్రం కేవలం 6లక్షల 59వేల 24 పాజిటివ్ కేసులకు 3710 మంది మాత్రమే చనిపోయారని ప్రభుత్వం చెప్పడం నిజాల్ని కప్పించుకోవడం కాదా ? అని ప్రశ్నించారు దాసోజు.

”కోవిడ్ మరణాలపై టీఆర్ఎస్ ప్రభుత్వం ఐసిఎంఆర్ గైడ్లెన్స్ ని ఉల్లంఘించింది. చావు పై అబద్దాలు ఆడకూడదని రాజ్యంగంలోని 21 ఆర్టికల్ లో వుంది. ఒక వ్యక్తి ఎలా చనిపోయాడనే విషయం పై అబద్దం ఆడకూడదు. కానీ కేసీఆర్ సర్కార్ ‘రైట్ టూ డై’ ని కూడ అతిక్రమించింది. టీఆర్ఎస్ కరోనా చావులని తక్కువగా చేసి చూపించిందన్నదానికి ఆధారాలు వున్నాయి. టీఆర్ఎస్ సర్కార్ దొంగలెక్కలు చెబుతుందనే సంగతి జిహెచ్ఎంసి లో అందుబాటులో వున్న డేటా ఆదారంగానే అర్ధం చేసుకోవచ్చు. కేవలం జిహెచ్ఎంసీ పరిదిలో 2017లో 50714 మరణాలు సంభవించాయి. 2018లో 53033, 2019లో 64166, 2020లో 76375, 2021 జూన్ 30 నాటికి 47472 మరణాలు సంభవించిననట్లు జిహెచ్ఎంసి గణాంకాల్లో ఇచ్చారు. 2017, 2018, 19 ఈ మూడేళ్ళ యావరేజ్ తీసుకుంటే ఏడాది 55791 మరణాలు. కానీ 2020లో 76375 , 2021 జూన్ 30 నాటికే 47472 మరణాలు .. ఈ ఆకస్మిక మరణాల పెరుగుదలకు కారణం కేసీఆర్ చెప్తారా ? లేదా కోవిడ్ టాస్క్ ఫోర్స్ చైర్మన్ కేటీఆర్ చెబుతారా ? ఇక మిగతా తెలంగాణా రాష్ట్రం డాటా పరిలీలిస్తే 2017 లో 39530 మరణాలు, 2017 లో 38130, 2019 లో 57990, 2020లో 79272 , 2021 ఆరునెలల్లో 57841 మరణాలు.. ఈ మొత్తం డాటా విశ్లేషిస్తే 1లక్షా 13వేల 480 మంది కేవలం కోవిడ్ కారణంగా చనిపోయారని మాకున్న సమాచారం. దీనిపై బహిరంగా చర్చకు సిద్దం. ఆరోగ్య శాఖ అధికారులు కానీ, కోవిడ్ టాస్క్ ఫోర్స్ చైర్మన్ కేటీఆర్ చర్చకు సిద్దామా ? అని సవాల్ విసిరారు దాసోజు

” కరోనా బాదిత కుటుంబాలకు సాయం చేయాలనీ సుప్రీమ్ కోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపధ్యంలో బాదిత కుటుంబాలకు న్యాయం జరగాలంటే తెలంగాణ రాష్ట్రంలో కరోనా మరణాల అసలు సంఖ్య బయటకి రావాలి. సుప్రీం ఆదేశాలు మేరకు కేంద్రం బాదితులకు సాయం ప్రకటిస్తే … టీఆర్ఎస్ ప్రభుత్వం చెబుతున్న 3710 మందికే సాయం అందుతుంది. 1లక్షా 13వేల 480 మంది చనిపోయారని గణాంకాలు చెబుతున్నాయి. ఒకవేళ కేంద్రం నష్టపరిహారం చెల్లిస్తే మిగతా కుటుంబాలకు ఎవరు న్యాయం చేస్తారు? అందుకే టీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలకు పోకుండ నిజమైన లెక్కలు చెప్పాలి. వెంటనే కోవిడ్ మరణాలని ఆడిట్ చేసే విధంగా డెత్ ఆడిట్ కమిటీని ఏర్పాటు చేయాలి” అని డిమాండ్ చేశారు దాసోజు.

”టీఆర్ఎస్ ప్రభుత్వానికి మానవత్వం లేదు. కరోనా కారణంగా చాలామంది బిడ్డలు తల్లితండ్రులని కోల్పోయి అనాధలగా బ్రతుకుతున్నారు. అనేక రాష్ట్రంలో కోవిడ్ వలన అనాధలైన పిల్లల బాధ్యత తీసుకున్నాయి. కానీ మానవత్వం లేని కేసీఆర్ సర్కార్ ఈ దిశగా అలోచించడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరచి అనాధలై పిల్ల ల భవిష్యత్ కు భరోసా కల్పిస్తూ వారి విద్య, వసతి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు దాసోజు.

కేసీఆర్ పై తెలంగాణ సమాజం న్యాయ పోరాటానికి సిద్ధం కావాలి:

ముఖ్యమంత్రి హామీ తప్పితే ప్రజలు కోర్టుకు వెళ్ళవచ్చని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుని స్వాగతించారు దాసోజు. ఢిల్లీ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ని తప్పినందుకు ఓ వ్యక్తి కోర్టు వెళ్ళిన సంఘటనని ప్రస్తావించిన దాసోజు… కేసీఆర్ పై ఈ రకంగా వందల కేసుల పెట్టాలని పిలుపునిచ్చారు. 2014,2019 మేనిఫెస్టో లో ఒక్క హామీ కూడా అమలు చేయలేదు కేసీఆర్. దళిత ముఖ్యమంత్రి, కేజీ టు పిజీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ బృతి, డబల్ బెడ్ రూమ్ ఇల్లు.. ఇలా చెప్పుకుంటూపొతే … ఒక్క హామీని కూడా కేసీఆర్ అమలు చేయలేదు. కావున చైతన్యగల తెలంగాణ సమాజం, అడ్వకేట్లు, విద్యావంతులు, మేధావులు, ప్రజలు.. కేసీఆర్ పై పెద్ద ఎత్తున న్యాయపోరాటానికి సిద్దం కావాలి” పిలుపునిచ్చారు దాసోజు.