ఉన్న ఉద్యోగం పోయింది కాని అదృష్టంగా లాటరీ తగిలింది ఎంతంటే

The existing job was gone but luckily the lottery hit

0
87

ఓ పక్క ఉన్న ఉద్యోగం పోయింది. దీంతో చేతిలో డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నాడు. ఇలాంటి సమయంలో అతనికి అదృష్టం తలుపుతట్టింది. లాటరీ రూపంలో కోటి రూపాయలు వచ్చింది. దీంతో అతను ఎంతో ఆనందంలో ఉన్నాడు. ఇంతకీ ఈ లాటరీ ఎవరికి వచ్చింది, ఎక్కడ వచ్చింది అనేది పూర్తి వివరాలు చూద్దాం.

తమిళనాడుకు చెందిన 53 సంవత్సరాల నజీరాలీ దుబాయ్ లో ఉద్యోగం చేసుకుంటున్నాడు. అయితే కరోనా కారణంగా చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు అలాగే అతను కూడా ఉద్యోగం కోల్పోయాడు.
ఆర్ధిక ఇబ్బందుల వ‌ల్ల కుటుంబసభ్యులను ఇండియాకు పంపించేశాడు. ఇక అక్కడే ఉండి ఏదైనా ఉద్యోగం కోసం చూస్తున్నాడు.

ఓరోజు తన స్నేహితుడు మహజూజ్ తో కలసి ఓ లాటరీ టిక్కెట్ కొనుగోలు చేశాడు. ఇక ఇటీవల ఆ టికెట్ కి రెండో బహుమతి వచ్చింది.నజీరాలికి 1 మిలియన్ దిర్హమ్స్ వచ్చాయి. ఇక దానిని స్నేహితులు ఇద్దరూ పంచుకున్నారు. నజీరాలికి 5 లక్షల దిర్హమ్స్ రావడంతో సుమారు కోటి రూపాయల వరకూ వచ్చాయి. ఇక ఈ డబ్బులతో ఓ రెస్టారెంట్ ఓపెన్ చేసి వ్యాపారం చేయాలనుకుంటున్నాడు.