అక్రమ సంబంధాలు చివరకు జీవితాలను నాశనం చేస్తున్నాయి. ఎన్నో కుటుంబాలు చితికిపోతున్నాయి. ఏకంగా విడాకుల వరకూ వెళుతున్నారు. కేరళలోని అలప్పుజాలో ఓ ఘటన తీవ్ర కలకలం రేపింది. అక్క ఇంటికి వెళ్లిన యువతి ఇంట్లో శవమై కనిపించింది. అసలు ఏమైంది అనేది చూస్తే. కేరళలోని చెర్తాలా కడక్కరపల్లిలో ఉల్లాస్, సువర్ణలకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద అమ్మాయికి రతీష్ తో వివాహం చేశారు. ఇక చిన్న కుమార్తె హరికృష్ణకు పెళ్లి కాలేదు. ఆమె నర్సుగా పనిచేస్తోంది. ఆమె అక్క కూడా ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా చేస్తోంది.
హరికృష్ణ అక్క మొన్న ఆస్పత్రికి వెళ్లింది. ఈ సమయంలో బావ పిల్లలని చూసుకునేందుకు హరికృష్ణని తీసుకువెళ్లాడు. అక్క భర్త రతీష్ ఆమెని రాత్రి ఇంటిలో ఉంచాడు. కాని ఉదయం మాత్రం హరికృష్ణ కనిపించింది. పోలీసులు విచారణ చేపట్టారు. అప్పటి నుంచి అక్క భర్త రతీష్ పరారీలో ఉన్నాడు. చివరకు ఇది హత్య అని అక్క భర్త రతీష్ మరదలిని చంపాడు అని తేల్చారు.
పోలీసుల విచారణలో రతీష్ కీలక విషయాలు వెల్లడించాడు. హరికృష్ణతో నాకు సంబంధం ఉంది. కానీ ఈమధ్య ఆమె మరొకరితో సంబంధం పెట్టుకుందని వారిద్దరు వివాహం చేసుకోవాలనుకున్నారు. అది నచ్చక గొడవ జరిగింది దీంతో ఆమెపై దాడి చేశాను ఆమె చనిపోయిందని తెలిపాడు.