ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు కౌషిక్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

0
45

కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ లో చేరిన హుజూరాబాద్ నేత పాడి కౌషిక్ రెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. ఆయన టిఆర్ఎస్ లో చేరిక సందర్భంగా రెడ్డి, వెలమ అగ్రవర్ణ నేతలకు గారు అని సంబోధించడం, మిగతా కులాల వారిని గారు అనకుండా పిలవడం వివాదాస్పదమైంది. అయితే తాను అలా పిలవలేదని, అందరినీ గారు అని సంబోధించానని కౌషిక్ రెడ్డి తాజాగా ఒక వీడియోను వెలుగులోకి తెచ్చారు.

అంతేకాకుండా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన విమర్శలకు కౌంటర్ ఇస్తూ తన ట్విట్టర్ ఖాతాలో పాడి కౌషిక్ రెడ్డి పోస్టు పెట్టారు. కౌషిక్ రెడ్డి చేసిన పోస్టులో కంటెంట్ ఇదీ…

’’గౌరవ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీరంటే నాకు చాల గౌరవం ఉంది మీ హోదాకి తగిన విమర్శలు చేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం.నేను పుట్టినప్పటి నుండి ఇప్పటివరకు నా మిత్రులు బహుజన మరియు దళిత బిడ్డలే. మీరు ఎవరో ఎడిట్ చేసిన వీడియోని పోస్ట్ చేసి మీ స్థాయిని మీరు తగ్గించుకున్నారు!’’

దీనికి తన స్పీచ్ లోని 6 సెకన్ల వీడియోను ట్విట్టర్ పోస్టుకు జత చేశారు. ఆ లింక్ పైన ఉంది చూడొచ్చు. ఇదీ..

ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన కామెంట్స్ తాలూకు పోస్టు ఆల్ టైమ్ రిపోర్ట్ స్టోరీ కింద ఉంది చూడొచ్చు.

బ్రదర్ అంటూనే కౌషిక్ రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మైండ్ బ్లోయింగ్ క్లాస్

మొత్తానికి హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో పాడి కౌషిక్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యారు.