సుమతో విడిగా ఉన్న మాట నిజమే – అందుకు కారణం చెప్పిన రాజీవ్ కనకాల

Rajeev kankala clarification on disputes with suma

0
134

తెలుగు సినిమా పరిశ్రమలో యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా ఎవరికి పరిచయం చేయక్కర్లేదు. బుల్లితెర యాంకర్స్ లో ఆమెకి ఉన్నంత క్రేజ్ మరెవ్వరికి లేదు. తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీ కపుల్స్ లో సుమ, రాజీవ్ కనకాల కూడా ఉంటారు. 20 సంవత్సరాలుగా యాంకర్ గా బుల్లితెరపై సందడి చేస్తున్నారు.

ఎక్కడో కేరళ నుంచి ఇక్కడికి వచ్చి తెలుగు ఎంతో స్పష్టంగా మాట్లాడుతూ అందరి ఇంటి అమ్మాయిలా కలిసిపోయారు సుమ. అందుకే సుమని తెలుగుప్రేక్షకులు అంత బాగా ఇష్టపడతారు. ఇక సుమ రెమ్యునరేషన్ గురించి ఎన్నో వార్తలు వినిపిస్తాయి. అలాగే కొన్ని రోజుల క్రితం రాజీవ్ ఆమె విడిపోయారు అని వార్తలు వినిపించాయి. వారు విడిగా ఉంటున్నారు అనే వార్తలు తెగ వైరల్ అయ్యాయి.

తాజాగా ఈ విషయంపై రాజీవ్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. కొన్ని రోజులు సుమతో విడిగా ఉండాల్సి వచ్చిందని చెప్పారు. అయితే అది గొడవల వల్ల కాదు. అమ్మ చనిపోయిన తర్వాత దేవదాస్ కనకాల ఒక్కరే మణికొండలోని ఇంటిలో ఉండేవారు, నేను సుమ ఎల్ అండ్ టీలో ఉండేవాళ్లం . అయితే నాన్నని తమ దగ్గరికి షిఫ్ట్ చేద్దామనుకుంటే ఆయన బుక్ లైబ్రరీ చాలా ఎక్కువగా ఉందని.. అది తమ ఫ్లాట్లో సరిపోకపోయేసరికి అక్కడే ఉండిపోయాము. నేను నాన్నతో ఉన్నాను. దీంతో తాము విడిపోయామని కొందరు వార్తలు రాసేశారు అని చెప్పారు.