ఏడాదిలో కేవలం 5 గంటలు మాత్రమే ఈ ఆలయం తెరుస్తారు

The temple is open only 5 hours a year

0
38

మన దేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. ఎంతో చరిత్ర కలిగిన పుణ్య క్షేత్రాలు ఉన్నాయి. అనేక దేవాలయాల్లో కొన్ని రహస్యాలు, ఎన్నో అద్భుతాలు, మరెన్నో ప్రత్యేకతలు కలిగి ఉన్నాయి. ఇక నిత్యం వేలాది మంది భక్తులతో రద్దీగా ఉన్న ఆలయాలు కూడా మన దేశంలో వందల సంఖ్యలో ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం ఓ ఆలయం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ఆలయాన్ని కేవలం ఏడాదిలో 5 గంటలు మాత్రమే తెరుస్తారు.

ఛత్తీస్ గడ్ లోని నిరయ్ మాతా ఆలయం. ఇక్కడ కేవలం ఏడాదిలో 5 గంటలే ఆలయం తెరుస్తారు. ఈ సమయంలో వేలాది మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు. గరియాబంద్ జిల్లా కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో కొండపై ఈ దేవాలయం ఉంటుంది.

ఈ గుడి ఎప్పుడు తీస్తారు అంటే ఛైత్ర నవరాత్రి రోజున తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకే దర్శనం కల్పిస్తారు. మళ్లీ ఏడాది తర్వాతే భక్తులకి ఇక్కడ ప్రవేశం ఉంటుంది. ఇక్కడ కేవలం భక్తులు కొబ్బరికాయ, అగరబత్తులతో మాత్రమే పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో మహిళలకు ప్రవేశం లేదు.