ఓ ఇంటివాడు కాబోతున్న హీరో సుమంత్

Hero sumanth second wedding invitation viral

0
99

హీరో సుమంత్ ఓ ఇంటివాడు కాబోతున్నారట‌. తాజాగా పెళ్లికార్డ్ కూడా వైర‌ల్ అవుతోంది.
సుమంత్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని టాలీవుడ్ లో వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇక వ‌ధువు ఎవ‌రంటే
వారి కుటుంబానికి అత్యంత సన్నిహితమైన పవిత్ర అనే ఓ వ్యాపారి కూతురిని పెళ్లాడబోతున్నాడని
చర్చ నడుస్తోంది.

ఈ పెళ్లికార్డ్ ఒకటి నెట్టింట్లో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఎస్ పీ అనే అక్షరాలను పెద్దగా కూర్చి పెళ్లి కార్డును డిజైన్ చేశారు. 2004లో కీర్తిరెడ్డిని సుమంత్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే, మనస్ఫర్థల కారణంగా ఇద్దరూ విడిపోయారు. ప్రేమ‌క‌థ సినిమాతో ఆయన చిత్ర సీమ‌లోకి ఎంట్రీ ఇచ్చారు.

సత్యం, గోదావరి, గోల్కొండ హైస్కూల్ ఇలాంటి ఎన్నో సినిమాలు ఉన్నాయి. కపటధారి సినిమా ఇటీవ‌ల విడుద‌లైంది సూప‌ర్ హిట్ అయింది. ఇప్పుడు అనగనగా ఒక రౌడీ సినిమా చేశాడు.ఇక ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ ప‌నులు సాగుతున్నాయి.