గ‌రుడ‌పురాణం ప్ర‌కారం ఏ పాపానికి ఏ శిక్ష‌లంటే

Garuda Puranam punishments

0
119

మ‌న దేశంలో చాలా మంది గరుడ పురాణం గురించి తెలుసుకుంటారు. హిందూ ధర్మంలో గరుడ పురాణానికి చాలా ప్రాశస్త్యం ఉంది. ఈ గ‌రుడ పురాణంలో మ‌నిషి ఎలా ఉండాలి ఎలాంటి త‌ప్పులు చేస్తే శిక్ష‌లు ఏమి ఉంటాయి అనేది పూర్తిగా వివ‌రించి ఉంటుంది. గరుడ పురాణం ఆధారంగా ఒక వ్యక్తి మరణించిన తర్వాత స్వర్గం వెళతాడా నరకం వెళతాడా అనేది తెలుస్తుంది.

ఎవ‌రైనా మ‌న‌కు మంచి చేసినా వారిని చెడుగా చూసినా వారికి అపాయం చేసినా వారిని న‌ర‌కంలో దారుణంగా శిక్షిస్తార‌ట‌. అంతేకాదు ఇత‌రుల డ‌బ్బు దోచుకోవాలి అని చూస్తే వారిని న‌ర‌కంలో తాడుతో క‌ట్టి చంపుతారు.స్వార్థం కోసం ఇత‌రుల‌ని ఇబ్బంది పెడితే వేడి నూనె పోసిన పెద్ద పాత్రలో వేయిస్తారు.

మ‌న ఆనందం కోసం ఇత‌రుల‌ని బాధ‌పెడితే పాములతో నిండిన బావిలోకి నెట్టివేయబడుతారు.
వివాహం అయినా ఇతరులతో శారీరక సంబంధాలు కలిగి ఉంటే ఇనుమును కాల్చి వారి అవయవాల‌పై పోస్తారు. మ‌హిళ‌ల‌ను అత్యాచారం చేసినా వివాహం చేసుకుని వ‌దిలివేసినా మ‌ల‌మూత్ర బావిలో
ప‌డేస్తారు.