దేశంలో కొత్త విమాన‌రంగ సంస్ధ – ఆకాశ ఎయిర్

The new airline in the country - Akasha Air

0
37

ప్రముఖ ఇన్వెస్టర్ రాకేష్ ఝంజువాలా భారత విమానయాన రంగంలోకి ప్రవేశించారు.
తక్కువ ధరకే విమాన ప్రయాణం చేసేందుకు అనువుగా ఎయిర్ లైన్ ని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు. భ‌విష్య‌త్తులో ఏవియేష‌న్ సెక్టార్ త‌క్కువ రేటుకి ప్ర‌జ‌ల‌కు విమానాల్లో ప్ర‌యాణించే సౌక‌ర్యం క‌ల్పించ‌గ‌ల‌దని ఆశిస్తున్నా అన్నారు.

ఆయన ఓ ఇంటర్వ్యూలో ప‌లు విష‌యాలు తెలిపారు. రాబోయే నాలుగేళ్లలో 70 విమానాల ఫ్లీట్లతో కొత్త ఎయిర్ లైన్ ని స్టార్ట్ చేసే యోచన తనకు ఉందని తెలిపారు. ప్ర‌జ‌ల‌కు త‌క్కువ రేటుకే విమాన ప్ర‌యాణం అందించాల‌ని త‌న ఉద్దేశం అన్నారు.

ఈ వెంచర్ కోసం 35 మిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేసే విషయాన్ని పరిశీలిస్తున్నానని తెలిపారాయ‌న‌.
తమ ఎయిర్ లైన్ ని ఆకాశ ఎయిర్ అని వ్యవహరిస్తామని తెలిపారు. డెల్టా ఎయిర్ లైన్స్ కి చెందిన మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ నేతృత్వంలో టీమ్ ఉంటుందని రాకేష్ ఝంజువాలా తెలిపారు. ఇక ఒక్కో విమానంలో 180 మంది ప్ర‌యాణించేలా తమ విమానాలు ఉంటాయ‌ని తెలిపారు.