వివాహం అయిన తర్వాత తల్లి అవ్వాలి అని ఏ మహిళకి అయినా కోరిక ఉంటుంది. అమ్మతనం అలాంటిది.నవ మాసాలు మోసి పెంచి పెద్ద చేసి ప్రయోజకుల్ని చేయాలి అని ఆ తల్లి భావిస్తుంది. కొందరు పిల్లల కోసం ఎంతో తపిస్తుంటారు. ఇప్పుడు ఎన్నో మందులు పద్దతులు కూడా సంతానం కోసం పాటిస్తున్నారు. అయితే ఇక్కడ ఓ కుటుంబానికి జరిగిన ఘటన గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు.
ఆ దంపతులకు పెళ్లయి 8 ఏళ్లు అయింది. వారికి సంతానం కలగలేదు. 32 ఏళ్ల మహిళకు ఘాజియాబాద్ కు చెందిన వ్యక్తితో 8 ఏళ్ల క్రితమే వివాహమైంది. పిల్లల కోసం ఎన్నో రకాల మందులు వాడారు. ఆస్పత్రులకి వెళ్లారు. ఐయూఐ వంటి పద్ధతుల్లో సంతానం కోసం ప్రయత్నించారు. ఆమెలో అండాలు తక్కువగా ఉండడం వల్ల ఆమె తల్లి కాలేకపోయింది.
ఢిల్లీలోని సీడ్స్ ఆఫ్ ఇన్నోసెన్స్ అనే సంతాన సాఫల్య ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వారికి పరీక్షలు చేశారు వైద్యులు. అప్పటికే నాలుగు సార్లు ఐయూఐ ట్రీట్ మెంట్ తీసుకున్నట్టు గుర్తించారు. ఆమెకి ప్రధాన సమస్య ఏమిటి అంటే అండాల ఉత్పత్తికి కారణమయ్యే యాంటీ ములేరియన్ హార్మోన్ స్థాయిలు తక్కువగా ఉన్నాయి. ఆమెకి చికిత్స అందించి ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ పద్ధతి ద్వారా సంతాన భాగ్యం కలిగేలా చేశారు.
ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయికి జన్మనిచ్చింది. దీంతో ఆ కుటుంబం చాలా ఆనందంలో ఉన్నారు. ఒక బిడ్డ కోసం ఇన్ని సంవత్సరాలు చూశాం. ఇప్పుడు మా కుటుంబానికి నలుగురు సంతానం కలిగారు అని ఆనందిస్తున్నారు.