ప్రతీ ఇంటిలో పూజ గది ఉంటుంది లేదా దేవుడి పటాలతో ఓ గూటిలాంటిది ఏర్పాటు చేసుకుంటాం. దేవుడికి ప్రత్యేకంగా ఒక గదిని కేటాయించడం అన్నది మన తాత ముత్తాతల నుంచి ఇంటిలో కట్టుకుంటున్నాం. ఈరోజుల్లో చాలా వరకూ అపార్ట్ మెంట్ ఫ్లాట్లు ఉండటం వల్ల పూజ గది పై చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. మరి పండితులు ఏమంటున్నారు అనేది చూద్దాం.
పూజ గదిని సాధ్యమైనంత వరకూ ఈశాన్యం లేదా తూర్పు లేదా ఉత్తరం దిక్కున ఏర్పాటు చేసుకోవడం మంచిది. మీది ఒకవేళ డూప్లెక్స్ రెండు అంత అంతస్దుల ఇళ్లు అయితే కచ్చితంగా దేవుడి గది కింద మాత్రమే ఉండాలి . సెల్లార్ లేదా బేస్మెంట్లో పెట్టుకోకూడదు.
మీకు స్ధలం లేకపోతే వంటింట్లోనే ఈశాన్య దిక్కున పూజా మందిరాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. పడకగదులలో దేవుడి గూటిలాంటిది పెట్టవద్దు.బాత్రూంకు సమీపంలోనూ ఏర్పాటుచేసుకోకూడదు. ఇక పెద్ద పెద్ద విగ్రహాలు కూడా ఇంట్లో పెట్టకూడదు. ఒకవేళ ఉంటే కచ్చితంగా నిత్యం పూజలు చేసి దూప దీప నైవేద్యాలు పెట్టాలి.