ఒక్క టీ ఖరీదు 15 లక్షలు… ఏమిటి దీని స్పెషాలిటీ ?

0
139

టైటిల్ చూసి షాక్ అయ్యారా ఇదేదో సెలబ్రెటీ చేస్తున్న టీ అనుకుంటున్నారా మరి తెలుసుకుందాం. బెంగాల్ లోని కమర్హతి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న మదన్ మిత్ర కోల్కతాలోని భవానిపూర్ ప్రాంతంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. వెస్ట్ బెంగాల్ సీఎం మమత భవానీపూర్ సెగ్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు ఈ సమయంలో ఆయన అక్కడ ప్రచారం చేస్తున్నారు.

మమతకే ఓటు అంటూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ప్రధాని మోదీ,కేంద్రప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. అక్కడ జనం మధ్య ఛాయ్ వాలా అవతారమెత్తిన ఎమ్మెల్యే మదన్ మిత్ర. తన అభిమానులు, ప్రజలకు టీ ఇచ్చారు. కప్పు టీ ధర రూ.15 లక్షలు అని చెప్పినప్పటికీ మాములుగానే టీ ఇచ్చారు.

ఎమ్మెల్యే మదన్ మిత్ర మాట్లాడుతూ ఇది ఒక ప్రత్యేకమైన టీ. మీరు ధర అడిగితే మాత్రం ఒక కప్పు ధరను రూ.15 లక్షలుగా చెప్తాను అని అన్నారు . దానికి కారణం ప్రతి పౌరుడి బ్యాంక్ ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామని మోదీ అప్పట్లో మాట ఇచ్చారు మరి ఏళ్లు గడుస్తున్న ఆ రోజు ఇంకా రాలేదని, ఇది ఎప్పుడు నెరవేరనుందోనని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు