మొన్న ఆషాఢం సారెకు మించి నేడు శ్రావణం సారె పంపిన వియ్యంకుడు

గోదావ‌రోళ్ల మ‌ర్యాదలు చూసి అంద‌రూ సూపర్ అంటూ కామెంట్లు చేశారు.

0
105

తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలంలోని గాదరాడకు చెందిన ఓం శివశక్తి పీఠం వ్యవస్థాపక ధర్మకర్త బత్తుల బలరామకృష్ణ, వెంకటలక్ష్మి దంపతులు త‌మ కుమార్తెకు ఇటీవ‌ల వివాహం చేశారు. గత నెలలో యానాంలోని వియ్యంకుడు తోట రాజు ఇంటికి కావిళ్ల కొద్దీ ఆషాఢం సారె పంపించారు. ఈ ఫోటోలు వీడియోలు తెగ వైర‌ల్ అయ్యాయి. గోదావ‌రోళ్ల మ‌ర్యాదలు చూసి అంద‌రూ సూపర్ అంటూ కామెంట్లు చేశారు.

తాజాగా అంతకుమించిన సారె పంపారు వియ్యంకుడు. శ్రావణమాసం సందర్భంగా తోట రాజు కూడా యానాం నుంచి నిన్న పెద్ద ఎత్తున సారె పంపి అందరి దృష్టిని ఆకర్షించారు. 10 టన్నుల స్వీట్లు, 100 అరటిగెలలు, పలు రకాల పండ్లు 2 టన్నులు, నూతన వస్త్రాలు, వివిధ రకాల పువ్వులు ఉన్నాయి.

ఇక క‌రోనా వ‌ల్ల పెళ్లి అంగ‌రంగ వైభ‌వంగా చేయ‌లేక‌పోయాం అని తెలిపారు. అందుకే ఇలా భారీగా సారె పంపిస్తున్నాం అన్నారు అమ్మాయి పేరెంట్స్. మన సంస్కృతి, సంప్రదాయాలను తెలియజెప్పాలన్నదే తమ ఉద్దేశమని తెలిపారు, ఏది ఏమైనా ఈ సారె వీడియోలు చూసి అంద‌రూ చాలా బాగుంది ఈ సంప్ర‌దాయం అంటున్నారు.