ఆఫ్గనిస్తాన్ లో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూశాం. అయితే దీని ఎఫెక్ట్ కొన్ని వస్తువులపై పడుతుంది అంటున్నారు ట్రేడ్ పండితులు. ముఖ్యంగా బిర్యానీ ధరలు చాలా చోట్ల పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. ఇంతకీ ఆప్ఘన్ దెబ్బకి బిర్యానీ రేట్లు పెరగడం ఏమిటి అంటే?
మోస్తరు పట్టణాల నుంచి చిన్న చిన్న గ్రామాల వరకూ బిర్యానీ సెంటర్లు ఈ రోజుల్లో చాలా వెలిశాయి. బిర్యానీ తయారీలో మాంసం, బాస్మతి రైస్ ప్రధానమైనా ఆ రుచి తేవడంలో డ్రై ఫ్రూట్స్ కీలక పాత్ర వహి
స్తాయి. ఆఫ్గనిస్తాన్ లో ప్రస్తుతం తాలిబన్ల పాలనతో కొన్ని రేట్లు అమాతం పెరుగుతున్నాయి. ముఖ్యంగా బిర్యానీలో ఎండుద్రాక్ష, ఆల్మండ్, అత్తి, జీడిపప్పు, పిస్తాపప్పులను ఉపయోగిస్తారు.
ఈ డ్రై ఫ్రూట్స్ లో ఎక్కువ ఆఫ్గనిస్తాన్ నుంచే దిగుమతి అవుతున్నాయి. దీని వల్ల పెద్ద పెద్ద హోటల్స్ కి ఇప్పుడు కరోనా కష్టాలతో పాటు ఈ డ్రై ఫ్రూట్స్ రేట్లు పెరగడం పెద్ద ఇబ్బందికరం అంటున్నారు. అంతేకాదు మరింత పన్నులు పెంచినా ఈ డ్రై ఫ్రూట్స్ రేట్లు పెరుగుతాయి అంటున్నారు నిపుణులు. తాలిబన్ల పాలనలోకి వచ్చాక డ్రై ఫ్రూట్స్ ఎగుమతులపై ఆంక్షలు పెట్టినా, పన్నులు పెంచినా రేట్లు మాత్రం 30 శాతం పెరుగుతాయి అంటున్నారు వ్యాపారులు. ఇప్పటికే దిల్లీ మార్కెట్లో భారీగా రేట్లు పెరిగాయి.