ద్రాక్ష పండ్లు రుచికి చాలా తీయగాను పుల్లగాను ఉంటాయి. ఇక పిల్లలు పెద్దలు అందరూ కూడా వీటిని తింటారు. కిలో ద్రాక్ష ఎంత ఉంటుంది మార్కెట్లో ధర 100 రూపాయల నుంచి ఉంటుంది. ఒక్కో చోట ఒక్కో రకంగా ధర ఉంటుంది. అయితే ఇక్కడ ద్రాక్ష రేటు తెలిస్తే మాత్రం నిజంగా షాక్ అవుతారు. ఎర్రని ద్రాక్షగుత్తి ధర 11 వేల డాలర్లు. భారత కరెన్సీలో అక్షరాల రూ 7.5 లక్షలు. అంటే ఈ ఒక్క ద్రాక్ష పండు ధర 35 వేలు వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ద్రాక్షగా అది రికార్డు నమోదు చేసింది. జపాన్ లో పండ్ల ధరల వేలు, లక్షల్లో ఉంటాయి. సరికొత్త పండ్లు అన్నీ ఇక్కడే కనిపిస్తాయి. మరి ఈ ద్రాక్ష కూడా ఇక్కడే గుర్తించారు. సేంద్రియ పద్దతిలో పండించిన పండ్లను వేల ఖరీదుకు కొని బంధువులకి వ్యాపారులకి కానుకగా ఇస్తూ ఉంటారు. ఈ పండ్లని 2008లో ప్రీమియం వెరైటీ ఫలాలుగా మార్కెట్లోకి తీసుకువచ్చారు.
జపాన్ డేటరీలోని ఇషికావా దీవిలో వీటిని ప్రత్యేకంగా పెంచి అమ్ముతారు. కాని కేవలం పంట సమయంలో 100 కేజీలు లేదా 200 కేజీలు మాత్రమే దొరుకుతాయి. ఎక్కువగా ధనవంతులు బహుమతిగా దీనిని ఇస్తారు. గుత్తి ఏకంగా ఏడున్నర లక్షలు ఒక్కో ద్రాక్ష పండు రూ.35000 కి అమ్మారు. మరి ఈ పండు కావాలి అంటే జపాన్ వెళ్లాల్సిందే.