త్వరలో అల్యుమినియం రైల్వే కోచ్లు – వీటి వల్ల లాభాలు ఏమిటంటే

aluminum railway coaches - these are the benefits

0
39

భారతీయ రైల్వే కొత్త టెక్నాలజీతో ముందుకు వెళుతోంది. వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టిన భారతీయ రైల్వే తాజాగా మరో కొత్త టెక్నాలజీని తీసుకురానుంది. వచ్చే ఏడాది నుంచి అల్యూమినియంతో తయారు చేసిన రైల్ కోచ్లను తీసుకురానుంది.
మోడరన్ కోచ్ ఫ్యాక్టరీ అల్యూమినియంతో కోచ్లను తయారు చేయనుంది. కోల్కతా మెట్రో రైల్కోసం ఈ బోగీలను రూపొందించనున్నారు.

సౌత్ కొరియాకు చెందిన ఓ సంస్థతో రూ. 128 కోట్ల ఒప్పందాన్ని చేసుకుంది. ఈ కరోనా వల్ల ఇటు ఈ ప్రాసెస్ కొంచెం లేట్ అయింది. వచ్చే ఆరు నెలల్లో ఈ ప్రాసెస్ మరింత ముందుకు సాగుతుందట. దీని ప్రత్యేకత ఏమిటి అంటే ఈ రైలు గంటకు 225 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినా ఎలాంటి ఇబ్బంది ఉండదట.

ఇక ఈ అల్యుమినియం కోచ్ లు అస్సలు తుప్పు పట్టవు. ప్రస్తుతం ఉన్న స్టెయిన్ లెస్ స్టీల్ కోచ్ ల కంటే ఇవి తక్కువ బరువు ఉంటాయి. వీటి లైఫ్ టైమ్ ఈజీగా 40 ఏళ్లు పైనే ఉంటుంది అంటున్నారు నిపుణులు. ఇవి తక్కువ బరువు ఉంటాయి కాబట్టి రైలు వేగంగా వెళ్లవచ్చు.