కొన్ని కొన్ని ఘటనలు వింటూ ఉంటే షాక్ అవుతున్నారు జనం. ఎంతో ఆనందంగా ఉండే జీవితాలని అక్రమ సంబంధాలతో వారికి వారే నాశనం చేసుకుంటున్నారు. అంతేకాదు హత్యలకు కూడా కారకులు అవుతున్నారు. బంధాలకు అనుబంధాలకు విలువ లేకుండా చేస్తున్నారు. ఈ దారుణ ఘటన తమిళనాడులో జరిగింది.
తమిళనాడు రాష్ట్రం కాంచీపురం జిల్లాలోని సోమంగళంలోని అదానంచెరి ప్రాంతంలో తంగవేల్, విమలారాణిలు ఉంటున్నారు. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. ఇక తంగవేల్ స్ధానికంలో ఓ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్నాడు. చాలా ఆనందంగా సాగిపోతున్న కుటుంబం. కానీ విమలారాణికి ఈ మధ్య రాజా అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధంగా మారింది.
రాజా ఆటోడ్రైవర్ పెళ్ళి కాలేదు విమలారాణి దంపతులు వుండే ప్రాంతంలోనే రాజా అద్దెకు ఉంటున్నాడు. భర్త లేని సమయంలో ఆమెతో శారీరకంగా కలుస్తున్నాడు. చివరకు కుటుంబంతో విసిగిపోయి విమలారాణి అతని మాటలకు లొంగింది. ప్రియుడి సాయం తీసుకుని భర్తని చంపేసింది. పోలీసుల విచారణలో అసలు నిజం ఒప్పుకుంది.