టూత్ పిక్ వాడుతున్నారా అయితే ఇది తెలుసుకోండి ఈ సమస్యలు రాకుండా జాగ్రత్త

Find out these if you are using a toothpick

0
86

భోజనం చేసిన ప్రతిసారీ ఆహారపదార్థాలు పళ్ల మధ్య ఇరుక్కున్నాయి అని చాలా మంది వాటిని తీస్తూ ఉంటారు. అయితే కొందరికి పళ్ల మధ్య సందులు ఎక్కువగా ఉంటాయి దీని వల్ల ఇలాఆహరం ఇరుక్కుంటుంది. నాన్వెజ్ తిన్నప్పుడో లేదా పీచుపదార్థాల్లాంటివి ఇరుక్కున్నప్పుడో చాలా మంది టూత్ పిక్ వాడుతూ ఉంటారు. అయితే కొందరు పాకెట్ లో పెట్టుకుని పదే పదే వాడతూ ఉండారు. కాని ఇలా చేయవద్దు అంటున్నారు వైద్యులు.

జింజివైటిస్ అనే సమస్య వస్తుంది దంతాలపై ఈ సమస్య వస్తే చిగుర్ల చుట్టూ ఉన్న ఇన్ఫెక్షన్, పంటి ఎముకకూ వ్యాపిస్తుంది. ఆ కండిషన్ను పెరియోడాంటైటిస్ అంటారు. చిగుర్ల వ్యాధి వస్తుంది. అందుకే ఈ టూత్ పిక్ కంటే మీరు నోటిలో నీరు పోసుకుని పుక్కిలించడం మంచిది.

ఇక్కడ ఓ విషయం గుర్తించాలి భోజనం తర్వాత ప్రతిసారీ టూత్పిక్ వాడాల్సి వస్తే ఒకసారి చిగుర్ల సమస్య ఏదైనా వచ్చిందేమో పరీక్షించుకోవాలి దీని వల్ల ఏదైనా సమస్య ఉన్నా ముందు గుర్తించినట్టు అవుతుంది.